ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. మంచి అధ్యాపకుడు. ఆచార్య చాణక్యుడు తన విధానాల బలంతో ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేశాడు. నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి.
ఆచార్య చాణక్యుడు డబ్బు, కుటుంబం, వ్యాపారం, సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలను కూడా ప్రస్తావించారు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు.
ఈ విధానాలు గతంలో మాదిరిగానే నేటికీ మనిషి అనుసరించదగినవి. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధానాలనే ఇప్పటికీ చాలా మంది యువకులు పాటిస్తున్నారు.
ఒక వ్యక్తి పొరపాటున కూడా చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు ప్రస్తావించాడు. అవి మిమ్మల్ని తర్వాత పశ్చాత్తాపపడేలా చేస్తాయని పేర్కొన్నాడు. ఈ రోజు ఆ తప్పులేంటో తెలుసుకుందాం.
పెద్దలను, స్త్రీలను అవమానించవద్దు – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. పెద్దలను, స్త్రీలను అవమానించే వారు జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందలేరు. అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు.
దీంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. అంతేకాదు తమ జీవితాన్ని గడపడం కోసం ప్రతి పైసా కోసం ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే పెద్దలను, స్త్రీలను ఎప్పుడూ అవమానించకండి.
సమయాన్ని వృధా చేయవద్దు – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. సమయానికి విలువనిచ్చే వ్యక్తికి సమయం విలువనిస్తుంది.
అలాంటి వ్యక్తులపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అమూల్యమైన మీ సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి. దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావచ్చు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండండి – ఆచార్య చాణక్యుడు ప్రకారం, డ్రగ్స్ లేదా మరేదైనా చెడు అలవాట్లను కలిగి ఉన్న వ్యక్తుల జీవితం నాశనం అవుతుంది. అలాంటి వారి దగ్గర డబ్బు నిలవదు.
చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తులు ప్రతి పైసా కోసం ఇతరుల మీద ఆధారపడి జీవిస్తారు. అందుకే ఎప్పుడూ చెడు అలవాట్ల జోలికి వెళ్లకండి.
డబ్బు విలువ – ఆచార్య చాణక్యుడు ప్రకారం.. డబ్బుకు విలువ ఇవ్వని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడూ అనవసారానికి మించి డబ్బు ఖర్చు పెట్టకండి.
ఇలా అదుపు లేకుండా డబ్బులు ఖర్చు చేసేవారి దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం చెందుతుంది. కాబట్టి పనికిరాని వాటిపై డబ్బు వృధా చేసేవారి దగ్గర అవసరానికి డబ్బు ఉండదు.
0 Comments:
Post a Comment