Car Prices Increased: కారు కొనుగోలుదారులకు షాకిచ్చిన కంపెనీలు.. భారీగా పెరిగిన కార్ల ధరలు..
Car Prices Increased: కారు కొనుగోలుదారులకు షాకిచ్చిన కంపెనీలు.. భారీగా పెరిగిన కార్ల ధరలు
ఈ కొత్త ఏడాదిలో కారు కొనుగోలు చేసేవారికి కొంత భారంగా మారనుంది. ఎందుకంటే కార్ల ధరలు పెరిగిపోయాయి. వివిధ కార్ల తయారీ కంపెనీలు ఆయా మోడళ్ల కార్లపై ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. కార్లే కాకుండా బైక్ ధరలు కూడా పెరిగాయి.
కార్లపై ద్రవ్యోల్బణం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్‌పుట్ వ్యవయం పెరగడంతో ధరలను పెంచక తప్పడం లేదని కార్ల కంపెనీలు పేర్కొంటున్నాయి.
దీంతో మారుతి సుజుకి నుంచి హ్యుండాయ్, టాటా మోటార్స్, అడి, మెర్సిడెస్ బెంజ్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మారుతి సుజుకి తన కార్ల ధరలు రూ.1500 నుంచి రూ.8000ల్లోపు పెంచేసింది.
కియామోటార్స్ వివిధ మోడల్ కార్ల ధరలు రూ.5000 పెరుగుతాయని ఇంతకుముందే ప్రకటించింది. మారుతి సుజుకిలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్.. హ్యుండాయ్ నుంచి ఐ10 నియోస్, క్రెటా, వెన్యూ, వెర్నా, టక్సన్, టాటా మోటార్స్‌లో నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్ కార్ల ధరలు పెరిగాయి.
కార్ల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారింది. ఈ మధ్య కాలంలో సామాన్య ప్రజలు కూడా కారును కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి వారికి ఆర్థికంగా భారం ఏర్పడే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment