పిల్లలు ఇష్టంగా ఆడుకునే ఆటలలో ఒకటి సబ్బు నీటితో బుడగలు ఊదడం. పిల్లలు ఈ ఆట ఆడే సమయంలో వారి మోహంలో అంతులేని సంతోషం కనిపిస్తుంది.
నోటితో బుడగలు ఊదుతూ వాటిని చేతితో పగలగొట్టే ప్రయత్నం చేస్తూ తెగ సంబరపడిపోతుంటారు.
అయితే ఈ నీటి బుడగలు సబ్బును నీటిలో వేయడం వల్ల ఏర్పడతాయి. వాటితో ఏర్పడే ఈ బుడగలు మన౦ చేతితో తాకగానే అవి పగిలిపోతాయి. అవి చాల సున్నితంగా ఉంటాయి. కొన్ని బుడగలు మాత్రం ఎక్కువ సమయం ఎగురుతూ ఉంటాయి.
అయితే అవి ఎందుకు పగిలిపోతాయో తెలియదు.. దాని గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నీటిలో సబ్బును వేసినప్పుడు నీటి తలతన్యత తగ్గడం వల్ల బుడగలు ఏర్పడతాయి. వీటి లోపల ఉండేదంత నీటి ఆవిరి,గేల్.
బయట గాలి పీడనం సమానంగా ఉన్నంత సేపు బుడగ స్థిరంగానూ ఉంటుంది. లోపలి పీడనం కొంచెం అధికంగా ఉండడంతో బుడుగ క్రమేపీ పెద్దదై బయట గాలి పీడనానికి సమానం అయ్యేంత వరకు విస్తరిస్తుంది.
దీని పొర చాలా పలుచగా అంటే మిల్లీమీటరులో పది నుంచి వందవ భాగం మందం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది ఏ రాపిడి తగిలిన పేలిపోతుంది.
చేయి తడిగా ఉందంటే నీతిపోరతో కూడి ఉన్నట్టే కాబట్టి బుడగ తాకిన దానిపై పొరకు ఏమి కాదు. పొడి చేత్తో ముట్టినపుడు బుడగ పై పోరలోని నీరు చేతికి అంటుకుంటుంది.
అప్పుడు బుడగ పైపోరలో కొంత నీరు కొంత వెళ్లిపోయినట్టే కదా. కొన్ని ఇటుకలు తీసేస్తే కులిపోయినట్లుగానే పొడి చేతికి తగిలినప్పుడు బుడగ పైపోరలోని నీటిని కోల్పోయి అది పేలిపోతుంది.
0 Comments:
Post a Comment