దిశ, ఫీచర్స్: చలికాలంలో వెచ్చగా ఉండేందుకు, శీతాకాలం చలి నుంచి రిలాక్స్ పొందేందుకు గ్లోబల్ మార్కెట్‌లో వివిధ రకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి.
అయితే ఈ మధ్య ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని నివేదిక సూచిస్తోంది. గత ఏడాది జనవరి నుంచి జులై వరకు ఐరోపాకు మొత్తం ఎలక్ట్రిక్-బ్లాంకెట్ ఎగుమతులు రూ. 200 కోట్లకు పైగా ఉన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి.
అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపు. కాగా ఇవి ఎంతవరకు సేఫ్ అనే విషయాలపై చర్చిద్దాం.
ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ అన్‌సేఫ్?
సాధారణంగా ప్రజలు కఠినమైన శీతాకాలపు ఉష్ణోగ్రతల సమయంలో రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు. అయితే మార్కెట్‌లో కొత్త గాడ్జెట్‌ల లభ్యతతో హీటర్స్‌ను ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ ద్వారా రీప్లేస్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సాంకేతికంగా ఈ- బ్లాంకెట్స్ వాటి చుట్టూ ఇంటిగ్రేటింగ్ ఎలక్ట్రికల్ హీటింగ్ వైర్లను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ కరెంట్‌ను క్యారీ చేయడం ఈ వైరింగ్ పని కాగా.. విద్యుత్ దుప్పటిని వెచ్చగా మారుస్తుంది.
కానీ ఈ టైప్ ప్రొడక్ట్స్ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వీటిలో సులభంగా బయటకు తీయగలిగే వైర్లు ఉన్నాయని, సెక్యూరిటీ వార్నింగ్స్ కూడా లేవని సూచిస్తున్నారు. ప్రొడక్ట్ రివ్యూస్ తనిఖీ చేసిన తర్వాత పాపులర్ సెల్లర్ నుంచి మాత్రమే ఎలక్ట్రిక్ దుప్పటిని కొనుగోలు చేయడం మంచిదంటున్నారు.
ఉత్పత్తిపై భద్రతా గుర్తులు, హెచ్చరికలు ఉండాలని.. లేదంటే చలికాలంలో దుప్పటిని ఉపయోగించినప్పుడు విద్యుత్ షాక్‌కు దారితీయవచ్చని వార్న్ చేస్తున్నారు. అంటే దుప్పటిలో వదులుగా ఉండే వైరింగ్‌ను ఎల్లప్పుడూ తనిఖీ చేయండి.
0 Comments:
Post a Comment