సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తమ ఇంట్లో చనిపోయిన కుటుంబ సభ్యుల ఫోటోలను ఉంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా పండుగ రోజులలో వారి కుటుంబ సభ్యుల ఫోటోలకు పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఉంచుకోవడం మంచిదా కాదా. అలా చనిపోయిన కుటుంబ సభ్యుల ఫోటోలను ఎలా ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి.
చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఉంచినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా గోడకు తగిలించరాదు. ఇలా చనిపోయిన వారి ఫోటోలను గుర్తుగా ఇంట్లో ఉంచుకోవడానికి ఒక చెక్క బల్ల పై ఫోటోలను ఉంచుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవ కావు. అంతేకాకుండా ఇంట్లోకి రాగానే ఎదురుగా చనిపోయిన వారి ఫోటోలు కనిపించకుండా ఉండేలా ఆ ఫోటోలను ఉంచుకోవడం మంచిది.
కుటుంబంలో మరణించిన వారందరీ ఫోటోలను ఇంట్లో ఉంచుకోవడం ఆశుభంగా చాలా మంది భావిస్తారు. అందువల్ల మీకు చాలా ఇష్టమైన ముఖ్యమైన వ్యక్తుల ఫోటోలను మాత్రమే ఇంట్లో ఉంచుకోవడం మంచిది.
అంతే కాకుండా చాలా మంది చనిపోయిన ఈ ఫోటోలను దేవుడి గదిలో ఉంచి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలా అస్సలు చేయకూడదు.
ఇంకా చెప్పాలంటే చాలామంది చనిపోయిన వారి ఫోటోలను పడకగదిలో ఉంచుకుంటూ ఉంటారు. పొరపాటున కూడా ఇలా ఫోటోలను పడక గదిలో అసలు ఉంచుకోకూడదు.
చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలను గుర్తుగా ఉంచుకోవాలి అనుకునేవారు ఇంట్లో హాల్లో ఉత్తరాదిశగా ఫోటోలను ఉంచడం మంచిదని వాస్తు శాస్త్రాన్ని నిపుణులు చెబుతున్నారు.
0 Comments:
Post a Comment