చాలామంది బయట భోజనం కంటే ఇంటి భోజనం ఉత్తమం అనే విషయాన్ని బాగా నమ్ముతారు. కానీ కొన్ని ఇంటి వస్తువులు మాత్రం మన శరీరం పై స్లో పాయిజన్ లా పనిచేస్తాయి.
అందుకే వాటికి దూరం పాటించాల్సిందే. ఈ వస్తువులు నెమ్మదిగా ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అందుకే అలాంటి వస్తువులను వెంటనే కిచెన్ నుండి దూరం చేయాలి. పూరి, బజ్జీలు, చోలే బటూరే అన్ని కూడా మైదాతోనే తయారవుతాయి.
కానీ ఈ పదార్థం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. అలాగే మలబద్ధకం, స్వెల్లింగ్ లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు.
అందుకే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే వెంటనే మైదాకు దూరంగా ఉండాల్సిందే. అదే విధంగా ప్రతి వంటకాలలో కూడా అవసరానికి మించి ఆయిల్ ఉపయోగించడం మంచిది కాదు. ఇది గుండెపోటు, క్యాన్సర్, డయాబెటిస్, కీళ్ల నొప్పులు, లాంటి వ్యాధులకు అతి ఆయిల్ కారణమవుతుంది.
అందుకే ఆయిల్ వినియోగాన్ని వీలైనంతవరకు తగ్గించాల్సి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా కిచెన్ లో అత్యధికంగా లభ్యమయ్యే ఉప్పు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఉప్పును రుచి కోసం ప్రతి వంటకాలలో వినియోగిస్తూ ఉంటారు. కానీ ఉప్పు కూడా ఆరోగ్యం పై స్లో పాయిజన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే ఉప్పులో సోడియం పరిమాణం ఉంటుంది. ఇది పెరిగితే ప్రెషర్ పెరుగుతుంది.
అలాగే నిర్ణీత వయసుకు ముందే వృద్ధాప్యాలు వస్తాయి. చాలామంది వైట్ బ్రెడ్ ఇష్టంగా తింటుంటారు. కానీ వైట్ బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతాయి.
ఎందుకంటే వైట్ బ్రెడ్ మైదాతోని తయారవుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉంటాయి.
అలాగే పంచదారను కూడా తీసుకుంటే ఇది కూడా మన ఆరోగ్యం పై స్లో పాయిజన్ లా పని చేస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు పంచదార తగ్గించాలి.
0 Comments:
Post a Comment