✍️లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యమా?
♦️కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తున్నట్లుంది!
♦️అధికారులపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆగ్రహం
🌻ఆకివీడు, న్యూస్‌టుడే:
‘నాడు-నేడు పనుల్లో జాప్యం.. విద్యాబోధన అమలు తీరు.. పర్యవేక్షణ లోపం.. ఇవన్నీ చూస్తుంటే టైమ్ పాస్ కోసం ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. రూ. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంత నిర్లక్ష్యం మీకు తగునా’ అని విద్యాశాఖ అధికారులపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఆకివీడులోని శివాలయం ప్రాథమిక, ఈస్టుపాలెం ప్రాథమికోన్నత పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్షించారు. మండల స్థాయి అధికారుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అంచలంచెల పర్యవేక్షణ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘మీరు గుర్తించిన బెెస్టు స్కూల్‌కి తీసుకెళ్లమంటే.. మీరే ఈస్టుపాలెం స్కూల్‌కి తీసుకొచ్చారు. ఇక్కడి పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఇలా అయితే ఎలా’ అని ఆర్‌జేడీ మధుసూదనరావు, డీఈవో వెంకటరమణ, డీవైఈవో శ్రీరామ్, ఎంఈవో రవీంద్రను ప్రశ్నించారు. నలుగురు అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని, మార్పు రాకపోతే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతిని ఆదేశించారు.
0 Comments:
Post a Comment