నేటికాలంలో విద్య చాలా ఖరీదైంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అందించాలని తాపాత్రాయపడుతుంటారు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరి రుణం తీర్చుకునే బాధ్యత విద్యార్థులపై ఉంటుంది.
కొంతమంది విద్యార్థులు, నిత్యవసర సరుకులు కొనేందుకు కూడా సరిపడా డబ్బులు లేని కుటుంబం నుంచి వస్తుంటారు. అలాంటి వారు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా విద్యను పొంది పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తమ అవసరాలను తీర్చుకుంటుంటారు.
ఈ పార్ట్ టైం జాబ్ విద్యార్థులకు మంచి మార్గాన్ని చూపుతుంది. వారు స్వంతగా పరిచేస్తే లేదా వ్యాపారం చేస్తే అది కూడా నైపుణ్యాను నేర్పిస్తుంది. అంతేకాదు నెట్ వర్క్ కూడా పెరుగుతుంది. చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది.
మీరు కూడా చదువుకునే సమయంలో పనిచేయడం వల్ల కొంత డబ్బు ఆదా చేస్తే.మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థులు చదువుకుంటూ చేయగలిగే బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ట్యూషన్
మీరు చదవుకుంటూ ట్యూషన్స్ చెప్పవచ్చు. సమయం తక్కువగా ఉన్నవారు వేసవి సెలవుల్లో హైస్కూల్ విద్యార్థులకు లేదా జూనియర్ కాలేజీ విద్యార్థులకు ట్యూషన్ చెప్పినట్లయితే కొంత డబ్బు సంపాదించవచ్చు. కొంతమంది విద్యార్థులకు సమయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు హోం ట్యూషన్స్ ప్రారంభిస్తే మంచి సంపాదన ఉంటుంది.
చేతితో తయారు చేసిన వస్తువులను అమ్మడం
మీకు అందమైన వస్తువులను తయారు చేయడంలో మంచి నైపుణ్యం ఉంటే..ఈ వ్యాపారం ప్రారంభించడం మంచిది. సిరామిక్ వస్తువు, గిఫ్టులు లేదా ఏదైనా ఇతర వస్తువులు తయారు చేసి ఆన్ లైన్లో కానీ స్థానిక దుకాణాల్లో కాని అమ్మవచ్చు. ఇలా మీరు డబ్బును సంపాదించవచ్చు.
డిమాండ్ పై ప్రింట్ ను అమ్మడం
తక్కువ బడ్జెట్ లో బిజినెస్ ప్రారంభించేందుకు ఇదొక్క బెస్ట్ ఆప్షన్. మీకు కళాత్మక నైపుణ్యాలు ఉంటే..మీరు టీ షర్టుల నుంచి కప్పుల వరకు డిజైన్స్ ప్రింట్ చేయవచ్చు. కస్టమర్లకు కావాల్సిన ఫొటోను ప్రింట్ చేసి అమ్ముకుంటే మంచి లాభం వస్తుంది.
ఫ్రీలాన్సర్‌గా జాబ్
ఎడిటింగ్, కాపీ రైటింగ్, వాయిస్ ఓవర్, గ్రాఫిక్ డిజైన్‌తో సహా ఆన్‌లైన్‌లో పని చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే సరిపోతుంది.
కూరగాయలు - ఆహార పదార్థాలు
మీ ఇంట్లో పండించిన కూరగాయలను మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు వాటిని అమ్మవచ్చు. కుకీలు, కేక్ లు కూడా తయారు చేసి అమ్మవచ్చు.
సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్
వేసవి సెలవుల్లో పిల్లలను చూసుకోవడం తల్లిదండ్రులకు కాస్త కష్టమైన పని. కాబట్టి తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపుల గురించి వెతుకుతుంటారు. మీరు పిల్లల కోసం సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయవచ్చు.
మీరు కొంతమంది పిల్లలను ఇంట్లో చేర్చుకుని, చదువుతో పాటు కొన్ని సరదా ఆటలు, డ్రామా, డ్యాన్స్‌తో సహా హస్తకళలను నేర్పించండి. దీని ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు.
0 Comments:
Post a Comment