BBCతల్లి డయానాతో ప్రిన్స్ విలియం, హ్యారీ
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ ఆత్మకథ 'స్పేర్' పుస్తకం అనేక సంచలన వాదనలు, ఆరోపణలు వెలుగులోకి తెచ్చింది.
బ్రిటిష్ రాజ కుటుంబంలోని కలతలను, చేదు విషయాలను ఈ పుస్తకం బయటపెడుతోంది.
ఈ పుస్తకంలోని సంచలన అంశాల్లోని ఒక విషయాన్ని మొదట గార్డియన్ పత్రిక వెల్లడించింది. అదేంటంటే ప్రిన్స్ విలియం, తన సోదరుడైన హ్యారీపై చేయి చేసుకున్న సంగతిని ఈ పత్రిక తొలుత నివేదించింది.
దీనిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని కెన్సింగ్టన్ ప్యాలెస్, బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించాయి.
స్పెయిన్‌లో 'స్పేర్' పుస్తకాలు కొన్ని అమ్ముడయ్యాయి. బీబీసీ న్యూస్ ఈ పుస్తకం కాపీని సంపాదించింది.
ఈ పుస్తకంలోని కొన్ని కీలక వాదనలు, అంశాల గురించి ఇక్కడ చదవండి:
Reuters
డయానా మరణం
ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్, తన తల్లి డయానా మరణం తర్వాత తన పరిస్థితి గురించి ప్రిన్స్ హ్యారీ ఈ పుస్తకంలో వివరించారు.
తల్లి లేదనే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మహిమలు ఉన్నాయని చెప్పుకునే ఒక మహిళ సహాయాన్ని కోరినట్లు హ్యారీ వెల్లడించారు.
ఆ మహిళ తనతో ఏం చెప్పిందో కూడా హ్యారీ పుస్తకంలో రాసుకొచ్చారు. ''తను జీవించలేని జీవితాన్ని మీరు జీవిస్తున్నారని మీ అమ్మ నాతో చెబుతోంది. తను కోరిన జీవితాన్నే నీవు జీవిస్తున్నావు'' అని ఆ మహిళ తనతో అన్నట్లు హ్యారీ రాసుకొచ్చారు.
1997లో పారిస్‌లో ఒక కారు ప్రమాదంలో డయానా మరణించారు. అప్పుడు హ్యారీ వయస్సు 12 ఏళ్లు.
PA Media
చార్లెస్ హత్తుకోలేదు
అయితే, మహిమలు ఉన్నాయని నమ్మే మహిళతో హ్యారీ ఎప్పుడు? ఎక్కడ మాట్లాడాడనే విషయాన్ని పుస్తకంలో ప్రస్తావించలేదు.
కారు ప్రమాదంలో డయానా మరణించారనే వార్తను చెప్పడం కోసం తన తండ్రి చార్లెస్ తనను నిద్ర లేపిన విషయాన్ని హ్యారీ పుస్తకంలో పేర్కొన్నారు.
మామూలు సమయాల్లోనే తన భావాలను సరిగా వ్యక్తం చేయలేని చార్లెస్, ఆ కఠిన సమయంలో తనను హత్తుకోలేదని హ్యారీ రాశారు.
డయానా మరణానికి కారణమైన పారిస్ కారు ప్రయాణం గురించి రాస్తూ, ఆమె మరణానికి గల అసలు కారణానికి సంబంధించిన ప్రశ్నలు తనలో మిగిలిపోయాయని హ్యారీ చెప్పారు.
PA Mediaక్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు విండ్సర్ క్యాజిల్ దగ్గర కలసి నడిచారు
హ్యారీ దుస్తులను చూసి నవ్విన విలియం, కేథరీన్
2005లో ఒక ఫ్యాన్సీ డ్రెస్ పార్టీకి ముందు నాజీ యూనిఫామ్ ధరించి ఇంటికి వచ్చిన తనను చూసి విలియం, కేథరీన్ నవ్వినట్లు హ్యారీ పుస్తకంలో పేర్కొన్నారు.
ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ కోసం నాజీ యూనిఫామ్ లేదా పైలట్ యూనిఫామ్‌లలో ఏది వేసుకోవాలనే అంశంలో విలియం, కేథరీన్‌ల అభిప్రాయం కోరడం కోసం వారిని పిలిచినట్లు హ్యారీ చెప్పారు.
''నేను విల్, కేట్లను పిలిచాను. ఏది వేసుకోవాలని అడిగాను. వారు నాజీ యూనిఫామ్ వేసుకోమని చెప్పారు.
నేను ఆ యూనిఫామ్‌తో పాటు దానికి తగిన మీసాలను కూడా అద్దెకు తీసుకొని ఇంటికి వచ్చాను.
అది చూసి కేట్, విల్లీ నవ్వారు. అది విల్లీ కాస్ట్యూమ్ కంటే చాలా అధ్వాన్నంగా, హాస్యాస్పదంగా ఉంది'' అని హ్యరీ రాశారు.
కాస్ట్యూమ్ పార్టీలో 'నేటివ్ అండ్ కలోనియల్' థీమ్‌తో యూనిఫామ్ ధరించి ఉన్న హ్యారీ ఫొటోను సన్ ప్రచురించినప్పుడు హ్యారీ వయస్సు 20 ఏళ్లు.
స్పేర్ పుస్తక విక్రయాల కోసం చాలా బుక్‌షాప్‌లు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి
ఈటన్కు హ్యారీ రావడం విలియంకు ఇష్టం లేదు
తాను ఈటన్ కాలేజీలో చేరేబోయే ముందు తనతో విలియం చెప్పిన మాటలను హ్యారీ ప్రస్తావించారు. ''నీకు నేను తెలియదు. నాకు నువ్వు తెలియదు హరాల్డ్'' అని తనతో విలియం అన్నట్లు హ్యారీ పేర్కొన్నారు.
అతని సర్కిల్‌లోకి తాను చొరబడకూడదనే ఉద్దేశంతోనే విలియం ఇలా మాట్లాడినట్లు చెప్పాడు.
''భయపడకు. నువ్వు నాకు తెలుసు అనే సంగతిని నేను మర్చిపోతా'' అని ఆ తర్వాత విలియమ్స్‌కు తాను చెప్పినట్లు హ్యారీ వెల్లడించారు.
మీడియా ఒత్తిడి మేరకు కరోలిన్ ఫ్లేక్కు దూరం
2009లో స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు టీవీ ప్రజెంటర్ కరోలిన్ ఫ్లేక్కు కలిసినట్లు హ్యారీ తెలిపారు.
అయితే, ఈ విషయం మీడియాకు త్వరగానే తెలిసిందని, ఫొటోగ్రాఫర్లు తమ వెంటపడ్డారని హ్యారీ రాసుకొచ్చారు.
''అది ఒక ఉన్మాదానికి దారి తీసింది. గంటల వ్యవధిలోనే జర్నలిస్టుల గ్రూపులు అన్నీ ఫ్లేక్ తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు, తన నాన్నమ్మ ఇంటి వద్ద గుమిగూడాయి.
అప్పుడప్పుడు మేం కలుస్తూనే ఉన్నాం. కానీ స్వేచ్ఛగా ఉండలేకపోయాం. మేం ఇద్దరం మంచి సమయం గడిపాం. బలహీనుల చేతుల్లో ఓడిపోవాలని అనుకోలేదు. అందుకే మేం కలుస్తూనే ఉన్నాం.
కానీ ఆ బంధం సరిదిద్దలేనంతంగా బీటలు వారింది. చివరకు ఈ బంధం నుంచి బయట పడాలని మేం నిర్ణయించుకున్నాం. ఆమె కుటుంబం కోసం మేం గుడ్‌బై చెప్పుకున్నాం'' అని హ్యారీ తెలిపారు.
కరోలిన్ ఫ్లేక్ ఒక సరదా వ్యక్తి, మంచి మనిషి అని హ్యారీ అభివర్ణించారు.
హ్యారీ-మేఘన్‌ల పెళ్లిని గ్రామ చర్చిలో చేయాలని విలియం ప్రతిపాదన
మేఘన్‌తో తన వివాహ వేడుక తేదీ, వేదిక తదితర విషయాల్లోనూ రాజ కుటుంబం జోక్యం చేసుకుందని హ్యారీ వెల్లడించారు.
సెయింట్ పాల్స్ కేథడ్రల్ లేదా వెస్ట్‌మినిస్టర్ అబేలో మేఘన్‌ను వివాహం చేసుకునే అవకాశం గురించి విలియంను సంప్రదించినట్లు హ్యారీ చెప్పారు.
అయితే, తాను ప్రతిపాదించిన వేదికలు చార్లెస్-డయానా, విలియం-కేథరీన్‌ల వివాహ ఘట్టాలకు వేదికలుగా ఉన్నందున వాటిలో తమ పెళ్లి సాధ్యం కాదని విలియం చెప్పాడని హ్యారీ వెల్లడించారు.
సెయింట్ పాల్స్ కేథడ్రల్, వెస్ట్‌మినిస్టర్ అబేకు బదులుగా తమ వివాహ వేడుకకు వేదికగా ఒక గ్రామ చర్చిని విలియం సిఫార్సు చేసినట్లు పుస్తకంలో హ్యారీ తెలిపారు.
2018 మే నెలలో విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో హ్యారీ-మేఘన్‌ల వివాహం జరిగింది.
స్టేజ్ ఫియర్
2013 వరకు బహిరంగ ప్రదర్శనలు ఇవ్వాలంటే తనకు చాలా భయంగా ఉండేదని హ్యారీ చెప్పారు.
ప్రసంగించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంలో తాను అసమర్థుడిని అని అనుకునేవాడినని వెల్లడించారు.
ప్రసంగానికి ముందు తన శరీరం అంతా చెమట పట్టేదని, భయం వేసేదని తెలిపారు.
''నేను బ్లేజర్, బూట్లు ధరించే సరికే భయానికే నా శరీరం అంతా, చెంపలపై చెమట పట్టేది'' అని హ్యారీ రాసుకొచ్చారు.
Reuters
గొడవపడొద్దని విలియం, హ్యారీని వేడుకున్న చార్లెస్
2021లో డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ అంత్యక్రియల తర్వాత తన అన్నతో జరిగిన ఒక ఘర్షణ గురించి హ్యారీ వివరించారు.
అప్పుడు తండ్రి చార్లెస్ తనకు, విలియంకు మధ్యలో నిలబడి... ''ప్లీజ్ బాయ్స్, నా చివరి జీవితాన్ని దయచేసి దుఃఖభరితం చేయకండి'' అని వేడుకున్నట్లు హ్యారీ చెప్పారు.
'విలియం హేర్ (వారసుడు), హ్యారీ స్పేర్'
హ్యారీ ఆత్మకథ పేరు 'స్పేర్'. ఇది హ్యారీ పుట్టినప్పుడు చార్లెస్ చేసిన ఒక వ్యాఖ్యను సూచిస్తుంది.
తనకు 20 ఏళ్ల వయస్సులో ఒక విషయం తెలిసిందని హ్యారీ పుస్తకంలో రాశారు.
తాను జన్మించినప్పుడు డయానాతో చార్లెస్ మాట్లాడుతూ, ''అద్భుతం. మీరు నాకు ఒక వారసుడిని ఇచ్చారు, ఒక స్పేర్‌ను ఇచ్చారు. మీ బాధ్యతను మీరు నిర్వర్తించారు'' అని అన్నట్లు హ్యారీ రాసుకొచ్చారు.
ఇతర ఆసక్తికర అంశాలు
మేఘన్ నటించిన టీవీ సిరీస్ 'సూట్స్'కు విలియం, కేథరీన్ అభిమానులు. ఇదంతా వారిద్దరూ మేఘన్‌ను కలవకముందు. మేఘన్‌తో తన బంధం గురించి వారిద్దరికీ చెప్పినప్పుడు వారు నోరు వెళ్లబెట్టారని హ్యారీ వెల్లడించారు.
''నేను మొత్తం చెప్పడం అయ్యాక విలియం ఇలా అన్నాడు. హరాల్డ్ ఆమె ఒక అమెరికా నటి. ఏదైనా జరగొచ్చు'' అని తనతో విలియం అన్నట్లు హ్యారీ చెప్పారు.
మేఘన్‌తో వివాహానికి ముందు గడ్డాన్ని తీసేయాలని విలియం తనను ఆదేశించారని హ్యారీ చెప్పుకొచ్చారు. వివాహ వేడుక కోసం తను గడ్డం ఉంచుకోవడానికి రాణి అనుమతి ఇచ్చినప్పటికీ విలియం తనకు ఆ ఆదేశాలు జారీ చేశారని వివరించారు.
వివాహ వేడుకకు ముందు మేఘన్ లిప్‌గ్లాస్ ఇవ్వాలని అడగడంతో కేథరీన్ నొచ్చుకున్నారని హ్యారీ పుస్తకంలో రాశారు. ''మేఘన్ తన చేతి వేలికి కాస్త లిప్ గ్లాస్‌ను తీసుకొని పెదాలకు రాసుకున్నప్పుడు కేథరీన్ చాలా విసుగ్గా కనిపించారు'' అని హ్యారీ తెలిపారు.
0 Comments:
Post a Comment