ఎక్కువ మంది ఇష్టపడే కమ్యూటర్ బైకులు: ధరలు రూ. 1 లక్ష కంటే తక్కువే..!!
భారతదేశంలో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాలలో కమ్యూటర్ మోటార్ సైకిళ్లకు ఎక్కువ ఆదరణ ఉంది. ఎందుకంటే ఇవి రోజు వారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి మైలేజ్ కూడా అందిస్తాయి. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు రూ. 1 లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే కమ్యూటర్ బైకుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
టీవీఎస్ స్పోర్ట్:
భారతీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాలను ఉన్న ఆదరణ మరియు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇందులో టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఇష్టపడే బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 64,050 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
టీవీఎస్ స్పోర్ట్స్ బైక్ 110 సిసి ఇంజన్ పొందుతుంది. ఇది 7350 ఆర్‌పిఎమ్ వద్ద 8.18 బిహెచ్‌పి పవర్ మరియు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది బైక్ యొక్క మైలేజిని 15 శాతం వరకు పెంచడంలో సహాయపడుతుంది. ఈ బైక్ యొక్క మైలేజ్ 110 కిమీ/లీ గా నమోదు చేయబడింది.
హోండా సిడి 110 డ్రీమ్:
హోండా మోటార్ సైకిల్స్ యొక్క 'సిడి 110 డ్రీమ్' బైక్ కూడా దేశీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 71,113 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 110 సిసి ఇంజిన్ కలిగి 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.67 బిహెచ్‌పి పవర్ మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.30 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ ఉంటుంది. హోండా సిడి 110 డ్రీమ్ ఒక లీటరుకు 70 కిమీ నుంచి 75 కిమీ మైలేజ్ అందిస్తుంది.
టీవీఎస్ స్టార్ సిటీ+:
మన జాబితాలో టీవీఎస్ స్టార్ సిటీ+ కూడా సరసమైన అధిక డిమాండ్ ఉన్న బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 75,890 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ కూడా ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇందులో 110 సిసి ఇంజిన్ 7350 ఆర్‌పిఎమ్ వద్ద 8.08 బిహెచ్‌పి పవర్ మరియు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 80 కిమీ నుంచి 86 కిమీ మైలేజ్ అందిస్తుందని నివేదించబడింది.
బజాజ్ పల్సర్ 125:
బజాజ్ ఆటో యొక్క పల్సర్ 125 దేశీయ మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 87,149 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ సింగిల్ సీట్, స్ప్లిట్ సీట్ మరియు నియాన్ సింగిల్ సీట్ వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ . 89,254, రూ. 91,642 మరియు రూ. 87,149 (ధరలు ఎక్స్-షోరూమ్).

0 Comments:
Post a Comment