Benifits of bathing with hot (warm) water
వేడి నీటి స్నానం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
చలి కాలం చన్నీటి స్నానం అస్సలు మంచిది కాదంటూ నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యల నుండి మొదలుకొని గుండెకు సంబంధించిన సమస్యల వరకు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. తాజాగా ప్రముఖ జపాన్ యూనివర్శిటీ వారు చేసిన ఒక అధ్యాయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. వేడి నీటితో స్నానం చేస్తున్న వారి ఆరోగ్యం ను పరిశీలించగా వారికి గుండె పోటు రావడానికి ఛాన్స్ లు చాలా తక్కువగా ఉన్నాయట. రెగ్యులర్ గా వేడి నీటి స్నానం చేస్తున్నట్లుగా చెప్పిన వారి గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదు. గుండెపోటు నుండి దాదాపుగా 30 శాతం వరకు వేడి నీటి స్నానం తో తప్పించుకోవచ్చు అంటూ గుర్తించారు. .
వేడి నీటితో స్నానం అనేది ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచిదంటూ ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు.
పక్షవాతం కూడా రాకుండా వేడి నీటి స్నానం ఉపయోగం దాయకం అంటూ నిపుణులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి వేడి నీటితో స్నానం చేసిన వారిలో ఎక్కువ శాతం పక్షవాతం వచ్చే అవకాశాలు లేవని వారు చెబుతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటీ అంటే పక్షవాతం వచ్చిన వారిలో కొద్ది మందిని ప్రశ్నించగా వారు వేడి నీటి స్నానం అలవాటు లేదని చెప్పుకొచ్చారట. అంటే వేడి నీటిని స్నానం చేయక పోవడం వల్ల వారికి పక్షవాతం వచ్చింది అనడంలో 60 శాతం ఛాన్స్ ఉందని వారు అధ్యనంలో వెళ్లడించారు.
గుండెపోటు ను ఎదుర్కొనే వారిలో చాలా మంది కి వేడి నీటి స్నానం అలవాటు లేదట. అందుకే వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండెకు మంచిదని వారు నిర్థారణకు వచ్చారు. గుండెపోటు నుండి అనేక అనారోగ్య సమస్యలకు వేడి నీటి స్నానం ఆమోదయోగ్యం అంటున్నారు. వేడి నీటి స్నానం మాత్రమే కాకుండా గోరు వెచ్చని వేడి నీటితో నింపిన టబ్ లో రెగ్యులర్ గా అయిదు నుండి పది నిమిషాలు జలకాలు ఆడటం వల్ల గుండె సమస్యలు దరిచేరవు అంటూ వారు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
0 Comments:
Post a Comment