Beetroot : ఇది చాలు... గుండె, డయాబెటిస్, జీర్ణక్రియకు మేలు
Beetroot : బాడీబిల్డప్ చేసేవారు బీట్రూట్ జ్యూస్ బాగా తాగుతారు.
వర్కవుట్ తర్వాత ఇది వెంటనే ఎనర్జీ ఇస్తుంది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు ఎక్కువ. ఇందులోని మాంగనీస్.. ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. అంతేకాదు.. ఇందులోని ఫొలేట్ అనే పోషకం గుండెకి మంచిది.
వేర్ల నుంచి వచ్చే ఇతర కూరగాయలతో పోల్చితే.. బీట్రూట్లో పిండిపదార్థం తక్కువ. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. ఇందులోని ఫైబర్.. రక్తంలో గ్లూకోజ్‌ని త్వరగా కలవనివ్వదు. ఫలితంగా షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు.
బీట్రూట్లో బెటాలైన్స్ (betalains) అనే యాంటిఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో మంట, నొప్పిని తగ్గిస్తుంది. గుండె దగ్గర వచ్చే మంటను ఇది తగ్గిస్తుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు బీట్రూట్ జ్యూస్‌ని షుగర్ కలపకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బీట్రూట్ శరీరంలోని విషవ్యర్థాలను తరిమేస్తుంది. ఫలితంగా డయాబెటిస్ ద్వారా వచ్చే ఇతర సమస్యలు, రెటీనోపతీ, కిడ్నీ వ్యాధులు, నరాల వ్యాధులు, కాళ్ల సమస్యలు, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
బీట్రూట్లో బెటాసియానిన్ (Betacyanin) ఉంటుంది. ఇది కణితులు (tumours) త్వరగా పెరగకుండా చేస్తుంది. ఈ కూరగాయలోని ఆల్ఫా లిపోయిక్ యాసిడ్.. కళ్లు, నరాలు దెబ్బతినకుండా చేస్తుంది. ఈ కూరగాయను తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
బీట్రూట్ని పచ్చిగా తినవచ్చు. లేదా ఉడకబెట్టకుండా.. రోస్ట్ చేసి తింటే ఎక్కువగా పోషకాలు శరీరానికి అందుతాయి. ఐతే.. డయాబెటిస్ పేషెంట్లు.. బీట్రూట్ని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే.. ఇందులోని తీపి వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది.
బీట్రూట్ని ఇతర కూరలు, సలాడ్లలో వాడొచ్చు. టమాటాతో కలిపి సూప్ చేసుకో వచ్చు. లేదా మసాలా బీట్రూట్ మజ్జిగ చేసుకోవచ్చు. గ్రిల్ చేసిన బీట్రూట్ స్టిక్స్ రుచికరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన స్నాక్‌గా దీన్ని పిలుస్తారు. బీట్రూట్ పచ్చళ్లను తినడం వల్ల పొట్టలో ఆరోగ్యం పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.
0 Comments:
Post a Comment