BBC- PM Modi: బిబిసి.. దాని పేరులోనే బ్రిటిష్ అని ఉంది కాబట్టి.. అది ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎవరి కోసం మద్దతుగా నిలుస్తుందో వివరించాల్సిన పనిలేదు..
దాని వెస్ట్రన్ పోకడలు, సో కాల్డ్ పరిశోధనలు, పరిశోధనలు ఈ విశ్వానికి అంతా తెలుసు.. పైగా తనకు గిట్టని, తనకు నచ్చని, తన ప్రయోజనాలకు అడ్డంకిగా ఉన్న దేశాలపై విషం చిమ్ముతూనే ఉంటుంది.. ఒక సెక్షన్ ను అడ్డం పెట్టుకొని రకరకాల వార్త కథనాలు వండి వారుస్తుంది.
సేమ్ ఆ కమ్యూనిస్టు పత్రికల మాదిరే విచ్చిన్న, విభజన వాదనలకు ఆజ్యం పోస్తుంది. ఆ మంటల్లో చలికాచుకుంటుంది.
BBC- Indira Gandhi
నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో అల్లర్లు చెలరేగాయి.. దీనిపై బిబిసి డాక్యుమెంటరీలు తయారు చేసింది. అందులో ఒక దానిని ఇటీవల టెలికాస్ట్ చేసింది.. సహజంగానే అది బీబీసీ ప్రమాణాలకు దగ్గరగా… వాస్తవాలకు దూరంగా ఉంది.. ఎలాగూ బిబిసి రూపొందించింది కాబట్టి కాంగ్రెస్ దీనిని చూపుతూ నానా యాగీ చేసింది.. ఎలాగూ దీనిని బిజెపి ఖండించింది.. సాక్షాత్తు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.. అంతేకాదు వెస్ట్రన్ మీడియా పోకడలను తూర్పార పట్టాల్సి వచ్చింది.. ఇవన్నీ గమనిస్తుంటే ఒకటి మాత్రం కచ్చితంగా కనిపిస్తోంది. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు అవగతం అవుతున్నది.
గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీ పాత్ర మీద సందర్భంగా బిబిసి ఒక డాక్యుమెంటరీని రెండు పార్ట్ లు గా ప్రసారం చేస్తుంది. వెంటనే ఓ పాకిస్తానీ రూట్స్ ఉన్న ముస్లిం ఎంపీ బ్రిటన్ పార్లమెంటులో ప్రస్తావించి, చర్చ ప్రారంభిస్తాడు.. బిబిసి కథనాల ఆధారంగా ఇండియాలో మీడియా మరింత మసాలా వేసి కథనాలు రాసుకుంటుంది.. మొత్తానికి ప్రధానమంత్రిని బజారుకు లాగడం దాని ప్రథమ ఉద్దేశం.. యాంటీ హిందూ సెక్షన్స్, యాంటీ మోడీ సెక్షన్స్ యాక్టివేట్ అయిపోతాయి.. ఇండియన్ మీడియాలో మొత్తుకోల్లు, శోకాలు స్టార్ట్ చేస్తారు..
ఈ దేశపు సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చిన కేసు కదా.. అదే సుప్రీంకోర్టులో ఓ పిల్ క
దాఖలయింది తాజాగా.. ఏమని అంటే… బిబిసి డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడం అన్యాయం, ఆ డాక్యుమెంటరీని పరీక్షించి, వెంటనే గుజరాత్ అల్లర్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. ఇదీ ఆ పిల్ సారాంశం.. అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు తప్పు.. బిబిసి డాక్యుమెంటరీ ఆధారంగా రివ్యూ చేసుకొని, చర్యలు తీసుకోవాలని పరోక్షంగా సుప్రీంకోర్టు తీర్పును ఆక్షేపించడం ఇది.. ఇండియా కదా ఏదైనా చెల్లుతుంది..
అందరం తీసుకున్న చర్య రాజ్యాంగపరమైన ప్రశ్నలకు తావిస్తోంది.. గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వార్తలు చూడటం, వాస్తవాలు రిపోర్టులు తెలుసుకునే హక్కు ఆర్టికల్ 19(1)(2) పౌరులకు ఉందా అనేది అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాలి. బిబిసి డాక్యుమెంటరీని చట్టవిరుద్ధం, దుష్ప్రచారం, కుట్రపూరితం, రాజ్యాంగ వ్యతిరేకం అని పేర్కొంటూ 2023 జనవరి 21న కేంద్ర సమాచార, ప్రసార శాఖ జారీచేసిన ఉత్తర్వును కొట్టేయాలి. ప్రాథమిక హక్కు అయిన పత్రిక స్వేచ్ఛకు కేంద్రం కళ్లెం వేయవచ్చా? అని పిల్ వేసిన న్యాయవాది వాదించాడు..
Indira Gandhi - PM Modi
ఇలాంటి తలా తోక లేని పిటిషన్లను సుప్రీంకోర్టు ఎందుకు అంగీకరించాలనేది ప్రథమ ప్రశ్న. తన గత తీర్పును ఆక్షేపిస్తున్నట్టుగా ఉన్న పిల్ ఇది. లోకస్ స్టాండి లేదు.
పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదు.. అది భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం సంక్రమించే అనుబంధ, అంతర్లీన హక్కు. ఈ సందర్భంలోనే బీబీసీ ఎప్పుడూ ఇండియాకు వ్యతిరేకమే. అసలు అదే విషయాన్ని ప్రూవ్ చేసుకుంది.. ఈరోజుకు అది యాంటీ ఇండియా కుట్రలో భాగస్వామిగా ఉంటుంది.. అయితే రెండు సంవత్సరాల పాటు బిబిసి ని దేశం నుంచి ఇందిరా గాంధీ బహిష్కరించింది.. కానీ ఇందిర అంత ధైర్యం మోదికి ఉందా?
అది 1970.. బిబిసి అప్పటి కలకత్తాలోని దారిద్రపు కడగండ్లను చిత్రీకరించి ప్రసారం చేసింది.. ఫ్రెంచ్ డైరెక్టర్ లూయిస్ దానిని ఈ
తీశాడు.. కానీ కథనాలపై ఇందిరా గాంధీ సంతృప్తిగా లేదు.. ఇదంతా ఓ దురుద్దేశం లో సాగిస్తున్న ప్రచారమని, వెంటనే ఈ కథను షెడ్యూల్ రద్దు చేసుకోవాలని బిబిసిని ఇండియా అడిగింది.. బ్రిటన్ ఫారిన్ ఆఫీస్ కు కూడా ఫిర్యాదు చేసింది.. ఓ రీసెర్చ్ పేపర్ ప్రకారం 1970 ఆగస్టులో బీబీసీని నిషేధించింది ఇండియా ప్రభుత్వం.. 1971 యుద్ధ సమయంలో బిబిసి మళ్లీ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది.
1975లో కూడా 41 మంది కాంగ్రెస్ ఎంపీలు బిబిసి ఉద్దేశపూర్వకంగా ఇండియా వ్యతిరేక కథనాలకు పాల్పడుతోందని ఆరోపించారు.. ఇప్పుడు అదే బిబిసి, అదే కాంగ్రెస్ బిబిసి భారత వ్యతిరేక కథనాలు కాంగ్రెస్ పార్టీకి సమ్మగా ఉన్నాయి.. కాల మహిమ.. ఈ కథను ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కాదు… ప్రస్తుతం బీబీసీ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో నాడు ఇందిరా గాంధీ హయాంలో ఏం జరిగింది అని చెప్పడమే..
0 Comments:
Post a Comment