సాధారణంగా దమ్ బిర్యానీ లేదా చికెన్ వండేటప్పుడు చికెన్ ముక్క జ్యూసీ గా ఉండడానికి పెరుగు కలుపుతుంటారు. ఈ కలయిక టేస్ట్ పరంగా ఓకే అయినా ఆరోగ్యపరంగా చెడు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మనం పాటించే ఆహార నియమాల్లో కొన్నింటి వల్ల జీర్ణక్రియ మార్గాల్లో అడ్డంకిని సృష్టించి, శరీరానికి అవసరమైన పోషకాలను పొందకుండా నిరోధిస్తాయని అంటున్నారు.
కొన్ని ఆహార సమ్మేళనాలను నివారించడం మన ఆరోగ్యం, వైద్యం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొన్ని వినడానికి కొత్తగా ఉన్న ప్రాచీన ఆయుర్వేద విధానం ప్రకారం అవే మంచిదంటున్నారు. ఆయుర్వేద నిపుణులు తెలిపే ఆ చెడు ఆహార పదార్థాల కలయిక గురించి ఓ సారి తెలుసుకుందాం.
భోజనం, నీరు
చాలా మంది భోజనం చేసే సమయంలో కచ్చితంగా నీరు తాగుతారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. నీరు మీ కడుపులోని ఆమ్లాలను పలుచన చేస్తుంది.
అలాగే ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేసి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. భోజనానికి ముందు నీరు తాగితే పర్లేదు కానీ భోజనం చేసే సమయంలో మాత్రం అధికంగా నీరు సేవించవద్దని నిపుణులు పేర్కొంటున్నారు.
పెరుగు, పండ్లు
సాధారణంగా పెరుగు అన్నంలో కచ్చితంగా ఏదో పండు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంత మంది పెరుగన్నంలో మామిడి పండు వేసుకుని తింటుంటారు. అయితే పండ్లలో ఉండే చక్కెరపై పనిచేసే బ్యాక్టీరియాలు పెరుగులో ఉన్నాయి.
ఇది జలుబు, అలెర్జీలకు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగన్నం తినే సమయంలో పండ్లను నివారించి, ఎండు ద్రాక్షలను తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.
సోడా, పిజ్జా
సోడా, పిజ్జా ఎప్పుడు కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే పిజ్జాలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో సోడా తాగితే శరీరానికి కీడు చేస్తుంది. అలాగే గుండె జబ్బులను కలుగజేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
బ్రెడ్, జామ్
చాలా మంది చిన్న పిల్లలకు అల్పాహారంగా బ్రెడ్ , జామ్ ఇస్తుంటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారని ఆనందిస్తాం.
కానీ ఇది ఆరోగ్యకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పిండి పదార్థం ఎక్కువగా ఉండడంతో తక్కువ ప్రోటీన్లు, కొవ్వును కలిగి ఉంటాయి.
పాలు, తృణధాన్యాలు
పాలలో కేసైన్ ఉంటుంది. ఇది తృణధాన్యాల్లో ఉండే ఎంజైమ్‌ను నాశనం చేస్తాయి. తృణధాన్యాలు తినే ముందు లేదా తర్వాత కనీసం ఒక గంట పండ్ల రసాన్ని తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాలను మాత్రం తాగకూడదని సూచిస్తున్నారు.
0 Comments:
Post a Comment