ఇండియన్ ఆర్మీ (Indian Army)లో సేవలందించాలనుకునే వారికి ఒక గుడ్‌న్యూస్. షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (SSC) ద్వారా 93 పోస్టుల భర్తీకి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్(Notification) రిలీజ్ చేసింది.
అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు కచ్చితంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి.
ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తూ మరణించిన సైనికుల భార్యలు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేష్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా పొందవచ్చు.
* ఖాళీలు, వయసు, విద్యార్హత
SSC కోర్సు ద్వారా మొత్తం 93 టిక్నికల్ పోస్టులను ఇండియన్ ఆర్మీ భర్తీ చేయనుంది. వీటిలో 61 పోస్టులు (SSC Tech) పురుషులకు, 32 పోస్టులు మహిళలకు (SSCW Tech) రిజర్వ్ చేశారు. SSC (Tech) ఖాళీలకు పురుషులు, మహిళల వయసు 2023 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.
అంటే అభ్యర్థులు 1996 అక్టోబర్ 2 నుంచి 2003 అక్టోబర్ 1 మధ్య జన్మించినవారై ఉండాలి. సర్వీస్‌లో మరణించిన భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది భార్యలకు SSCW (నాన్ టెక్), SSCW(Tech)- A పోస్టులు కేటాయించారు. 2023 అక్టోబర్ నాటికి వీరి వయసు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండవచ్చు.
ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు SSCకి అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే SSCW అభ్యర్థులు నాన్-టెక్నికల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, టెక్ వేకెన్సీస్‌కు ఏదైనా ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ అవసరం.
* అప్లికేషన్ ప్రాసెస్
అభ్యర్థులు ముందు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in విజిట్ చేయాలి. హోమ్ పేజీలో కనిపించే 'Officer Entry Apply or Login' లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదివి, వివరాలు నింపాలి. రిజిస్ట్రేషన్ తర్వాత డ్యాష్‌బోర్డులో 'Apply Online' ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
ఈ అప్లికేషన్‌లో అన్ని వివరాలు నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్‌ను సబ్మిట్ చేసే ముందు మరోసారి రీచెక్ చేసుకోవాలి. చివరకు సబ్మిట్ చేసి, ప్రింటవుట్ కాపీ దగ్గర పెట్టుకోవాలి.
* ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో ముందు షార్ట్‌లిస్ట్, SSB ఇంటర్వ్యూ, స్టేజ్ 2 వంటి దశలు ఉంటాయి. స్టేజ్ 2లో అర్హత సాధించిన వారిని వైద్య పరీక్షలకు పంపుతారు. SSB సిఫార్సు చేసిన, మెడికల్‌గా ఫిట్‌గా ఉన్న అభ్యర్థులకు అర్హత ప్రమాణాలకు లోబడి మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు.
అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి వారికి ట్రైనింగ్ ఇస్తారు. వీరికి శిక్షణ కోసం జాయిన్ లెటర్ జారీ చేస్తారు. ఫైనల్‌గా సెలక్ట్ అయిన వారికి 2023 అక్టోబర్‌లో ఎస్ఎస్‌సీ కోర్సు ప్రారంభమవుతుంది. తమిళనాడు , చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఈ కోర్సును నిర్వహిస్తారు.
0 Comments:
Post a Comment