Apple Side Effects: యాపిల్స్ ఎక్కువగా తింటే అంతే సంగతి.. మీరు ఈ జబ్బులు కొని తెచ్చుకున్నట్లే..
Apple Side Effects: ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఇందులో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి.
ఇవీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత రోజుల్లో యాపిల్స్ తినేవారు సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదని అంటూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా తినడం కూడా ప్రమాదమే. దీని వల్ల కలిగే నష్టాలేంటో ఓ సారి తెలుసుకుందాం.
యాపిల్ తినడం వల్ల వచ్చే సమస్యలు
**యాపిల్స్ ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
**యాపిల్స్ అధిక మెుత్తంలో తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతినవచ్చు.
**యాపిల్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి.
**యాపిల్స్ రెండు కంటే ఎక్కువ తీసుకుంటే మీ దంతాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
**యాపిల్స్ భారీ మెుత్తంలో తీసుకోవడం వల్ల మీ శరీరంలోని చక్కెర స్థాయిలు పడిపోతాయి.
0 Comments:
Post a Comment