ఆపిల్ సైడర్ వెనిగర్‌ను సాధారణంగా పలు వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో, బరువు తగ్గించడంలో దోహదం చేస్తుంది. అదే సమయంలో ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది కూడా.
ఏదైనా సరే పరిమితంగా వాడాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా అలాంటిదే. అతిగా వాడితే పలు సీరియస్ వ్యాధులకు కారణమౌతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంత మోతాదులో వాడాలి, అతిగా వాడితే డయాబెటిస్ ఇతర వ్యాధులు చుట్టుముడతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ డయాబెటిస్‌లో అత్యంత ప్రమాదకరం కానుంది.
ఫలితంగా డయాబెటిస్ నియంత్రించడం కష్టమౌతుంది. డయాబెటిస్ నుంచి కాపాడుకోవాలంటే..ఆపిల్ సైడర్ వెనిగర్ నుంచి దూరంగా ఉండాలి.
పళ్లకు హాని
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ఎసిడిక్ యాసిడ్ పంటి వ్యాధులకు కారణమౌతుంది. పంటిపై ఉండే ఎనామిల్‌ను దెబ్బ తీస్తుంది. దీనికారణంగా పళ్లు బలహీనమౌతాయి. పంటి చిగుళ్లు దెబ్బతింటాయి. పంటి నొప్పులతో బాధపడేవారికి ఇది ఏ మాత్రం మంచిది కాదు.
ఎసిడిటీ
ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఓ రకమైన యాసిడ్. ఇది తినడం వల్ల యాసిడ్ సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధ సమస్యలుండే అవకాశమున్నందున వీటికి దూరంగా ఉండాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఎముకలకు హాని కలుగుతుంది. అదే పనిగా ఆపిల్ సైడర్ వెనిగర్ వినియోగిస్తే ఎముకలకు బలహీనపడతాయి. కాల్షియం లోపం, బలహీనమైన ఎముకల సమస్యలతో బాధపడేవాళ్లు ఆపిల్ సైడర్ వెనిగర్ వినియోగించకూడదు.
చర్మానికి ప్రమాదకరం
చర్మానికి ప్రమాదకరం కావచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ సేవించడం వల్ల చర్మంలో మంట, దురద, ర్యాషెస్ సమస్యలు ఏర్పడతాయి. చర్మ సంబంధిత ఎలర్జీల నుంచి దూరంగా ఉండాలంటే ఆపిల్ సైడర్ వినియోగం మంచిది కాదు.
0 Comments:
Post a Comment