AP Sankranti Holidays : ఏపీలో సంక్రాంతిసెలవుల పొడిగింపు ?
ఏపీలో ఈ ఏడాది పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గతంలో కనీసం పది రోజుల పాటు సెలవులు ఇచ్చేవారు. ఇప్పుడు మారిన పరిస్దితుల్లో వాటిని తగ్గించడంపై వారు అభ్యంతరం తెలిపారు.
ఏపీలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయసంఘాలు తాజాగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా సంక్రాంతి సెలవుల చర్చ వచ్చింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు సంక్రాంతి సెలవులు పెంచాలని ఆయన్ను కోరాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మేరకు 11 నుంచి 16 వరకూ కాకుండా 18 వరకూ వీటిని పెంచాలని కోరాయి. దీనిపై స్పందించిన బొత్స .. సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ఈనెల 18వరకు పొడిగించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించారని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్రోపాధ్యాయ సంఘాలు వెల్లడించాయి. ఈనెల 11 నుంచి 16 వరకు పాఠశాల విద్యాశాఖ సంక్రాంతి సెలవులు ప్రకటించింది. 17న పునః ప్రారంభం కావాల్సి ఉండగా.. దీన్ని 18 వరకు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
0 Comments:
Post a Comment