AP High Court: కోర్టు ఆదేశించినా నిర్మాణాలు చేపట్టడం అక్రమమే కదా?: ఏపీ హైకోర్టు
అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల ప్రాంగణాల్లో కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సచివాలయాల నిర్మాణాలపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే నిర్మించిన సచివాలయాలు, కొన్ని ఆర్బీకే భవనాలను సంబంధిత పాఠశాలలకు అప్పగించామని.. మిగిలిన వాటిని అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘నిర్మాణాలు నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించినా భవనాలు కట్టడం అక్రమమే అవుతుంది కదా.. *గతంలో ప్రజావేదిక కూడా ప్రజల డబ్బుతో నిర్మించిందే. ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాల్సింది పోయి కూల్చేశారు. అప్పుడొక వైఖరి.. ఇప్పుడు మరోలా చేస్తే ఎలా?’’* అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజల సొమ్ముతో నిర్మించినందున ఆయా పాఠశాలల అవసరాలకే వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈనెల 24కి వాయిదా వేసింది.
0 Comments:
Post a Comment