Andhra News: జీవో నెం.1 ఈనెల 23వరకు సస్పెండ్ చేసిన హైకోర్టు..
అమరావతి: రహదారులపై బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబరు 1ని ఈ నెల 23 వరకు సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన డివిజన్ బెంచ్ కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.
0 Comments:
Post a Comment