Adani Stocks: జాతీయవాదంతో మోసం కవర్ చేయటం కుదరదు.. అదానీకి స్ట్రాంగ్ వార్నింగ్..!
Adani Stocks: భారత వ్యాపారవేత్త అదానీకి 2023 అస్సలు కలిసిరాలేదని చెప్పుకోవాలి. హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన సంచలన రిపోర్టు అదానీ కలలను చిదిమేసింది.
దీనిపై ఆయన స్పందిస్తూ.. భారత్ పై హిండెన్‌బర్గ్ క్యాలిక్యులేటెడ్ దాడి అని అదానీ అన్నారు. వేగవంతమైన భారత వృద్ధిని అడ్డుకునేందుకు చేసిన కుట్రపూరిత చర్య అని అదానీ అభివర్ణించారు.
హిండెన్‌బర్గ్ మళ్లీ ఎటాక్..
తన రిపోర్టును విడుదల చేసి గంటలు గడిచిన తర్వాత కూడా హిండెన్‌బర్గ్ అదానీ విషయంలో వెల్లడించిన రిపోర్టుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. దాదాపుగా 413 పేజీల రిపోర్టులో అనేక ప్రశ్నలు లేవనెత్తింది. సోమవారం మరోసారి స్పందించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. జాతీయవాదంతో మోసాన్ని కప్పిపుచ్చలేరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్ తన సమాధానంలో వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నించిందని ఆరోపించింది. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అదానీ గ్రూప్ జాతీయవాదాన్ని ఆశ్రయిస్తోందని హిండెన్‌బర్గ్ మరోసారి వ్యాఖ్యానించింది.
అదానీ ప్రకటనలు..
అమెరికా సంస్థ రీసెర్చ్ రిపోర్ట్ విడుదలతో అదానీకి కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన అదానీ గ్రూప్ జాతీయ వార్తా పత్రికలను ఆశ్రయించింది. వాటిలోని మెుదటి పేజీల్లో పెద్దపెద్ద యాడ్స్ తో ఇన్వెస్టర్లు, ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. అదానీ గ్రీన్ హైడ్రోజన్, విమానాశ్రయాలు, రోడ్లు, డేటా సెంటర్లు, డిజిటల్‌పై దృష్టి సారించిన వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడులను కలిగి ఉందంటూ ప్రకటనలో పేర్కొంది. స్థిరమైన విలువ సృష్టి, జీవితాలను సుసంపన్నం చేసేందుకు వ్యాపారాలను కలిగి ఉన్నట్లు అందులో ప్రచురించింది.
అదానీ షేర్స్ నేడు..
ఈ రోజు మార్కెట్లు తెరుచుకున్న తర్వాత కేవలం అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన అదానీ లిస్టెడ్ కంపెనీలు మాత్రం పతనాన్ని కొనసాగిస్తున్నాయి. చాలా గ్రూప్ కంపెనీల షేర్లు ఏకంగా లోయర్ సర్క్యూట్లలో లాక్ అయ్యి తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి.
రీసెర్చ్ రిపోర్ట్ కారణంగా పనతం కొనసాగటంతో గందరగోళంలో ఉన్న ఇన్వెస్టర్లు అదానీ ఎఫ్పీవోకు కొంత దూరం పాటించారు. అయితే సోమవారం అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ పుంజుకోవటంతో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు మెుగ్గు చూపారు. రెండవ రోజు రిటైల్ ఇన్వెస్టర్లు ఎఫ్పీవోలో చాలా కీలకంగా మారారు. గత వారం బాగా నష్టపోయిన తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్ ధర సోమవారం 10% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.
Looks like written by some illiterate pyg paid
ReplyDeleteWho had written that article?Has any brain in India had analysed and commented .Rather like idiots following some unknown agency in US which itself under malpractices in US being circulated to harm Indian Investors
ReplyDelete