Aadhar-Pan Card Link | వచ్చే మార్చి నెలాఖరులోపు ఆధార్ కార్డుతో అనుసంధానించని పాన్ కార్డులు పని చేయవని ఐటీ శాఖ అధికారులు హెచ్చరించారు.
Aadhar-Pan Card Link | ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు నిర్వహించాలన్నా..
పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం రుణాలు తీసుకోవాలనుకున్నా.. కొత్తగా బిజినెస్ ప్రారంభించినా.. వేతన జీవులు.. కార్పొరేట్ సంస్థల అధినేతలు, ఎగ్జిక్యూటివ్‌లు ప్రతియేటా ఐటీ రిటర్న్స్ సమర్పించాలన్నా.. `పాన్ కార్డ్ ( PAN Card ) తప్పనిసరి. తర్వాత అమల్లోకి వచ్చిన ఆధార్ నంబర్‌తోపాటు పాన్ నంబర్ సాయంతో ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలు చెక్ చేస్తున్నారు ఆదాయం పన్నుశాఖ అధికారులు..
ఆధార్ అమలై దశాబ్దం దాటినా ఇదీ పరిస్థితి
ఆధార్ నంబర్ అమల్లోకి వచ్చి దాదాపు దశాబ్దం కావస్తున్నా.. ఇప్పటికీ పాన్ కార్డ్ హోల్డర్లు వాటిని ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదు. ఇంతకుముందు పలు దఫాలు పాన్‌కార్డు-ఆధార్ అనుసంధానం చేయడానికి ఐటీ శాఖ అనుమతి ఇచ్చింది.
మొన్న మొన్నటి వరకు రూ.1000 ఫైన్‌తో వాటిని లింక్ చేయడానికి అనుమతించిన ఐటీ అధికారులు తాజాగా చివరి హెచ్చరిక జారీ చేశారు. వచ్చే మార్చి నెలాఖరులోగా ఆధార్‌తో పాన్ కార్డ్ నంబర్ అప్డేట్ చేయకపోతే.. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సదరు పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ కార్డ్ (పనికి రాని ఒక కార్డు ముక్క)గా మిగిలిపోతుందని హెచ్చరించింది. కనుక ఇప్పటికే పాన్ కార్డు కల వారంతా తమ ఆధార్ నంబర్లతో వాటిని అనుసంధానించాల్సిందే.
లింక్ చేయకుంటే ఏప్రిల్ నుంచి పని చేయదు
ఆధార్‌తో అనుసంధానించకపోతే వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇన్ఆపరేటివ్గా మారే పాన్ కార్డును ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించడానికి వీల్లేదని ఆదాయం పన్నుశాఖ అధికారులు తేల్చి చెప్పారు.
మినహాయింపు (జమ్ముకశ్మీర్, మేఘాలయ వాసులు) కేటగిరీ కిందకు వచ్చే వారు మినహా పాన్ కార్డు కల ప్రతి ఒక్కరూ.. ఇన్‌కం టాక్స్ యాక్ట్-1961 ప్రకారం 2023 మార్చిలోగా తమ ఆధార్ నంబర్‌తో అనుసంధానించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇటీవలే ట్విట్టర్ వేదికగా హెచ్చరించిన ఐటీ శాఖ.. దీన్ని అర్జెంట్ నోటీసుగా పరిగణించాలని, ఏమాత్రం ఆలస్యం చేయొద్దని పేర్కొన్నారు ఇన్‌కం టాక్స్ అధికారులు.
లింక్ చేయకుంటే ఇవీ కష్టాలు
పాన్కార్డులున్న వారిలో చాలా మంది ఇప్పటికే తమ ఆధార్ నంబర్ అనుసంధానించారు. లింక్ చేయాల్సిన వారు గణనీయంగానే ఉన్నారు. కనుక ఆధార్ లింక్ చేయకుంటే ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు వాడరాదు.
పెండింగ్‌లో ఉన్న ఐటీ రిటర్న్స్ రీఫండ్ నిలిచిపోతాయని చెబుతున్నారు. లోపాలు గల ఐటీ రిటర్న్స్ పెండింగ్‌లో పెట్టకుండా తదుపరి ప్రొసీడింగ్స్ పూర్తి చేయడం అసాధ్యం అవుతుంది. దీనివల్ల పన్నుపై వడ్డీరేటు, ఫైన్‌తో ఐటీఆర్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలు ఫేస్ చేయకుండా ఉండాలంటే పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానించడం ఎలాగో తెలుసుకుందాం.. !
మీరు మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లోనూ, మీ రిజిస్టర్డ్ ఫోన్ నుంచి 567678 లేదా 56161 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
ఆన్లైన్లో ఇన్‌కం టాక్స్ పోర్టల్‌కు వెళ్లి లేట్ ఫీజు చెల్లించిన తర్వాత పాన్-ఆధార్ కార్డు లింక్ చేసేయొచ్చు.
పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించే వారు.. incometax.gov.in/iec/foportalను విజిట్ చేయాలి.
అటుపై ‘Quick Links` సెక్షన్‌కు వెళ్లాలి.. అక్కడ స్క్రోల్ చేసి ‘Link Aadhaar’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
మీ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డు నంబర్ నమోదు చేయాలి.
‘I validate my Aadhaar Details` అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్ వివరాలు వెరిఫై చేసుకోవాలి.. అటుపై ‘Continue` ఆప్షన్ క్లిక్ చేయాలి.
ఈ ప్రక్రియ వాల్యుడేట్ చేసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ ఎంటర్ చేస్తే సరి.
అప్పుడు మీ పాన్- ఆధార్ అనుసంధానానికి లేట్ ఫీజు చెల్లిస్తే ఆధార్ నంబర్‌తో పాన్ కార్డు అనుసంధానించినట్లే.
పాన్ కార్డు అవసరం ఎందుకంటే..
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి, ఆదాయం పన్ను చెల్లించడానికి, టాక్స్ రీఫండ్ కావడానికి, ఆదాయం పన్నుశాఖ నుంచి సమాచారం పొందేందుకు పాన్ కార్డు అవసరం.
కొత్త వెహికల్ కొనాలన్నా.. ఇల్లు కొనుగోలు చేయాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొకరికి రూ.50 వేలకు పైగా ట్రాన్స్ఫర్ చేయాలన్నా పాన్ కార్డు సమర్పించాల్సిందే.
0 Comments:
Post a Comment