A course on marriage : భార్యాభర్తల బంధం ఎంతో విలువైనది. జీవితాంతం ఏకంగా ఉండే జంటగా వీరికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి జంట ఎల్లకాలం కలిసి ఉండటానికి ఇష్టపడుతుంటారు.
కానీ కొన్ని జంటలు మాత్రం అభిప్రాయ భేదాలు, ఇతర కారణాలతో విడిపోతుంటారు. కొందరైతే పిల్లలు పుట్టాక కూడా ఎవరి దారి వారు చూసుకుంటారు. దీనికి ప్రధాన కారణం ఇగోనే.
నేను చెప్పిందే వినాలి అనే భావనతో చాలా మంది విడాకుల వరకు వెళ్తున్నారు. ఫలితంగా భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి రాని ఆలోచన అతడికి వచ్చింది.
పెళ్లయిన వారు విడిపోకుండా ఉండేందుకు 2017లో ఓ సంస్థను ప్రారంభించాడు. దాని ద్వారా వారికి ఆలుమగల బంధంలో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు.
పెళ్లికి ముందు తరువాత దుల్హ దుల్హన్ పేరుతో కోర్సులు నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య మంచి బంధం బలపడాలంటే కచ్చితంగా వారికి తెలియాల్సిన కొన్ని ట్రిక్కులు చెబుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 1500 మందికి కోర్సులో శిక్షణ ఇచ్చాడు.
హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఇలియాస్ ఇరవై ఏళ్లపాటు ఫ్యామిలీ కౌన్సెలర్ గా పనిచేశాడు. ఆ అనుభవంతో దంపతులకు సంసారంపై అవగాహన కల్పిస్తున్నాడు. ఫలితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి విడిపోకపోకుండా ఉండేందుకు పలు మార్గాలు సూచిస్తున్నాడు.
భార్యాభర్తలు విడిపోవడానికి ప్రధాన కారణాలు అనేకం ఉంటాయి. అందులో ఒకరికంటే మరొకరు ఎక్కువ అనే అహం ఉండటం, ఇద్దరు సంపాదిస్తున్నా ఖర్చులపై నిలకడ లేకపోవడం, భార్య సంపాదిస్తుంటే భర్త ఇంట్లో ఉంటే గొడవలు, ఆర్థిక ఇబ్బందులపై ఇద్దరు నిందించుకోవడం, వరకట్న వేధింపులు, ఇంట్లో అత్తమామలు ఉండటం వల్ల, ఇంటి పనుల్లో సహకారం లేకపోవడం తదితర సమస్యలతో దంపతులు విడిపోయేందుకు కారణాలవుతున్నాయి.
ఫ్యామిలీ కౌన్సెలర్ గా పనిచేసిన అనుభవంతో పుస్తకాలు చదివి వాటి సాయంతో సిలబస్ రూపకల్పన చేశారు. 15 అంశాలపై 22 గంటల వ్యవధి ఉండేలా రూపకల్పన చేశాడు. ప్రొజెక్టర్, పీపీటీ సాయంతో బోధన చేస్తుంటాడు.
కోర్సు పూర్తయ్యాక ఏవైనా సందేహాలుంటే మరో పది సెషన్లు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. ఇలా కోర్సు చేసే వారికి రూ. 5 వేలు ఫీజుగా నిర్ణయించారు.
కరోనా కాలంలో మూడు నాలుగు నెలలు బ్యాచ్ లు నిర్వహించకున్నా ఇప్పుడు యథావిధిగా తరగతులు కొనసాగుతున్నాయి.
0 Comments:
Post a Comment