7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్.. డబుల్ కానున్న జీతాలు..!
7th Pay Commission Fitment Factor: కొత్త సంవత్సరం ప్రారంభంకావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. 52 లక్షల మందికి పైగా కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. అంతకుముందు 2022 చివరి నాటికి ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. ఇప్పుడు కొత్త సంవత్సరం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను త్వరలో సవరించాలన్న ప్రభుత్వ డిమాండ్‌ను అంగీకరించవచ్చు.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను మార్చాలని కేంద్ర ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పలు దఫాలుగా సమావేశాలు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024కి ముందే దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని.. బడ్జెట్ తర్వాత 2023 మార్చిలో అమలు చేస్తామని ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తే.. కేంద్ర ఉద్యోగుల జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను జనరంజకంగా రూపొందించడంపై దృష్టి సారించింది.
ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో ఫిట్మెంట్ మార్పు కీలకంగా మారనుంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం ప్రకారం జీతం లభిస్తుంది. దీన్ని 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ఉద్యోగుల నుంచి చాలా కాలంగా డిమాండ్ ఉంది. కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్‌ను కూడా మార్చిలో 38 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై నిర్ణయం తీసుకున్న తర్వాత రూ.26,000కు పెరగనుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం ప్రకారం.. ఇప్పుడు రూ.18 వేల బేసిక్ శాలరీకి ఇతర అలవెన్స్‌లను జోడిస్తే.. రూ.18,000 X 2.57 = రూ.46,260 వస్తుంది. అది 3.68 శాతానికి పెరిగితే.. ఉద్యోగులకు ఇతర అలవెన్సులు కలిపితే, జీతం 26000X3.68 = రూ.95,680 అవుతుంది.
చెప్పు తీసుకుని కొట్టాలి రా మీకు ఇంకో రెండు సంవత్సరాలు తర్వాత పే కమిషన్ వాస్తుంది ఇది ఎలా వస్తుంది రా జఫ్ఫా ఇది బీజేపీ ప్రభుత్వం
ReplyDeleteCorrect sir..ivi raasina vadiki cheppu kuda chala thakkuve
ReplyDelete