7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. త్వరలో ఫిట్‌మెంట్ పెరిగే అవకాశం!
కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.
త్వరలో ప్రభుత్వం నుంచి తీపి కబురు రానున్నట్లు సమాచారం. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచే అవకాశం ఉంది.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ రివిజన్ కోసం ఎంతో కాలం నుంచి వేచిచూస్తున్న ఉద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే. అయితే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత శాతం పెరిగే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.
బేసిక్ పేతో మల్టిపుల్ : తమ జీతాల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సవరించాలని ఉద్యోగుల సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక సాధారణ విలువ. ప్రస్తుతం ఉద్యోగుల మొత్తం జీతం పొందడానికి, బేసిక్ పేతో దీన్ని మల్టిపుల్ చేస్తారు.
3.68 రెట్లు పెంచాలని డిమాండ్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అన్ని గ్రూపులకు ఉమ్మడి ఫిట్‌మెంట్ ప్రయోజనం ప్రస్తుతం 2.57గా ఉంది. ప్రస్తుతం ఎవరైనా 4200 గ్రేడ్ పేలో రూ.15,500 బేసిక్ వేతనం పొందుతుంటే, అతని మొత్తం వేతనం రూ.15,500×2.57= రూ.39,835గా ఉంటుంది. అయితే 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన ప్రకారం.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచితే అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనుంది.
జీతం పెంపు ఎంత ఉంటుందంటే : కేంద్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 రెట్లు పెంచితే, అలవెన్సులు మినహా జీతం 18,000 X 2.57 = రూ.46,260 అవుతుంది. ఒకవేళ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ప్రకారం ఫిట్‌మెంట్ పెంచితే, అప్పుడు జీతం 26000 X 3.68 = రూ. 95,680 అవుతుంది. కేంద్రం 3 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపును అంగీకరిస్తే, అప్పుడు జీతం 21000 X 3 = రూ. 63,000 అవుతుంది. కాగా 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల బేసిక్ శాలరీ, ఫిట్‌మెంట్, అలవెన్సుల ఆధారంగా వారి వేతనం ఉండనుంది.
సెప్టెంబర్‌లో డీఏ పెంపు : 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం తమ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) 34 శాతం నుంచి 38 శాతానికి పెంచింది. దీంతో, ఉద్యోగులు జూలై 1, 2022 నుంచి వరుసగా అధిక మొత్తంలో డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పొందుతున్నారు.
ఏడాదికి రెండుసార్లు సవరణ : డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. జనవరి 1వ తేదీన ఒకసారి, తరువాత జూలై 1వ తేదీన రివైజ్ చేస్తారు. గత పెంపుతో దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందారు. డీఏ 4 శాతం పెంచడంతో ప్రస్తుతం ఇది 38 శాతంగా ఉంది. అంతకంటే ముందు ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు మార్చిలో డీఏను 3 శాతం పెంచడంతో అది 34 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.
Correct information teliste news publish cheyandi
ReplyDeleteChillara lekkalu vesi news publish cheyoddu
Fake news intha dare ga elaa publish chestunnaru
ReplyDelete