2023లో మహిళలకు షాక్, తులం బంగారం ఏకంగా రూ.65 వేలు దాటే చాన్స్, ఇప్పుడేం చేయాలో తెలుసుకోండి..
బంగారం ధరలు కొత్త సంవత్సరం కూడా భారీగా పెరిగాయి. అటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగానే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త సంవత్సరం హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో బంగారం ధరలు తెలుసుకుందాం.
బంగారం కొనాలి అని చూస్తున్నారా అయితే కొత్త సంవత్సరంలో బంగారం ఖరీదు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. నిజానికి పసిడి ప్రేమికులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. హైదరాబాదులో 24 క్యారెట్ల తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.53,710 గా పలుకుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 51,150గా పలుకుతోంది. కొత్త సంవత్సరం బంగారం ధర ఏకంగా 160 రూపాయలు పెరిగింది. అయితే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని బంగారం మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
2022 లో బంగారం ధరలు కాస్త స్థిరంగానే ఉన్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, మార్కెట్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం, కారణంగా ఇన్వెస్టర్లు బంగారం కన్నా కూడా ఇతర అసెట్ క్లాసెస్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. దీంతో బంగారం ఆల్టైమ్ గరిష్టస్థాయి 56 వేల నుంచి తగ్గుతూ వచ్చాయి.
కొత్త సంవత్సరం 2023లో మాత్రం పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, గోల్డ్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బంగారం ధరలు కొత్త సంవత్సరం మరోసారి గరిష్టస్థాయి తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. తులం బంగారం ధర ఏకంగా 65000 వరకు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, ప్రపంచ ఆర్థిక మాంద్యం, అమెరికాలో ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి కారణాలతో ఈ ఏడాది పసిడి ధరలు కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే పసిడి ధరలు ఈ స్థాయిలో పెరిగితే సామాన్యులకు అందనంత దూరం వెళ్లే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా, పసిడి ధరల నియంత్రణ చేసేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా దిగుమతి సుంకం తగ్గించే దిశగా ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఆశిస్తున్నారు.
మరోవైపు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో, ఎవరైతే ఫిజికల్ గోల్డ్ కొనాలనుకుంటున్నారో, ఇప్పుడే కొనుక్కుంటే మంచిదని, నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బంగారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడులు పెడితే సరిపోతుందని, నిపుణులు చెబుతున్నారు. సావరిన్ గోల్డ్ బాండ్స్ పై వడ్డీ కూడా పొందే అవకాశం ఉంది. మరోవైపు బంగారంలో బంగారం లో పెట్టుబడులు పెట్టేవారికి అటు డిజిటల్ వాలెట్ సైతం ఒక రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో మీరూ ఫిజికల్ రూపంలో కూడా బంగారం డెలివరీ పొందవచ్చు. లేదా బంగారాన్ని డిజిటల్ రూపం లోనే మీ బంగారం వాలెట్ లో ఉంచుకోవచ్చు. మంచి రేటు వచ్చినప్పుడు వాటిని విక్రయించి, లాభం పొందే అవకాశం ఉంది.
0 Comments:
Post a Comment