Earth's inner core : భూమి మధ్యలో ఉన్న పదార్థాన్ని అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ అని అంటారు.
ఇందులో ఇన్నర్ కోర్ పూర్తిగా సలసలగా కాగే ఐరన్‌తో కూడిన బంతిలా ఉంటుందని అంచనా. ఇది ప్లూటో అంత ఉంటుందనీ.. ఇది భూమిలా తిరగడం మానేసిందనే అంచనా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఇది రివర్సులో తిరుగుతుందనే అంచనా ఉంది. ఎందుకో తెలుసుకుందాం.
భూమికి సంబంధించి ఓ భారీ మార్పు వచ్చేలా కనిపిస్తోంది. భూమి మధ్యలో అత్యంత గట్టిగా ఉండే.. లోహ పదార్థం తిరగడం ఆగిపోయి ఉంటుందనే అంచనా ఉంది. అంటే ఏంటి దాని అర్థం?
భూమి పై పొరను క్రస్ట్ అని పిలుస్తారు. దాని కింద ఉండే పొరను మాంటిల్ అంటారు. క్రస్ట్ దాదాపు 70 కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది. ఆ తర్వాత మాంటిల్ మొదలవుతుంది. అది 2,880 కిలోమీటర్ల మందం ఉంటుంది.
మాంటిల్ తర్వాత ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ ఉంటాయి. ఔటర్ కోర్ 2,092 కిలోమీటర్ల మందం కలిగివుంటుంది. ఇన్నర్ కోర్ 2,414 కిలోమీటర్ల మందం కలిగివుంటుంది. ఇన్నర్ కోర్‌పై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అందువల్ల ఇది అత్యంత వేడిగా ఉన్నప్పటికీ.. చాలా గట్టిగా ఉంటుంది.
ఈ ఇన్నర్ కోర్ అనేది.. చిన్నగా ఏమీ ఉండదు. దాదాపు మరుగుజ్జు గ్రహమైన ప్లూటో (Pluto) అంత ఉంటుంది.
ఇప్పుడు సమస్య ఏంటంటే.. ఈ ఇన్నర్ కోర్.. అంతుబట్టని విధంగా, విచిత్రంగా ప్రవర్తిస్తోందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
భూమి లోపల నిజంగా ఏం జరుగుతోంది అనే అశంపై రకరకాల సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి.
ఇన్నర్ కోర్‌కి సంబంధించి తొలి ఆధారం 1996లో లభించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారు ఏమంటున్నారంటే.. కొన్నేళ్లవరకూ భూమి కంటే వేగంగా.. ఇన్నర్ కోర్ తిరిగిందనీ.. తర్వాత అది క్రమంగా నెమ్మదిస్తూ... ఓ దశలో తిరగడం పూర్తిగా ఆగిపోయిందనీ.. ఇప్పుడు అది రివర్సులో తిరగడం మొదలుపెట్టిందని అంటున్నారు.
భూకంపాలు వచ్చినప్పుడు వచ్చే సిస్మిక్ తరంగాలను ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు అంచనాలకు వస్తున్నారు. రివర్సులో ఎలా, ఎందుకు తిరుగుతుంది అనే ప్రశ్న రావచ్చు. వాళ్లు ఏమంటున్నారంటే.. ఈ ఇన్నర్ కోర్ అనేది.. ద్రవరూపంలో ఉన్న ఔటర్ కోర్‌లో తేలుతూ ఉందని.. అందువల్లే దాని తిరుగుడు లెక్క వేరుగా ఉండగలుగుతోందని అంటున్నారు.
ఈ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలంతా సమర్థించట్లేదు. దీన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు.
ఇలా ఇన్నర్ కోర్ ఇష్టమొచ్చినట్లు తిరగడం అనేది ఇదే మొదటిసారి కాదనీ.. ఇదివరకు చాలాసార్లు ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని వల్ల భూమిపై ఉండే జీవులకూ, మనుషులకూ ఎలాంటి సమస్యా రాదని చెబుతున్నారు.
0 Comments:
Post a Comment