Wrist watch - వాచీని ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారు? కారణం ఇదేనని తెలిస్తే...
కాన్ఫిడెంట్గా ఉండే విషయంలో మంచి లుక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెయిర్ స్టైల్, దుస్తులు, బూట్లు, చేతిలో ధరించే వాచ్ కూడా మంచి లుక్లో భాగమవుతాయి.
వాచీ అనేది సమయాన్ని తెలియజేయడంతో పాటు మన వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మనం వాచీని ధరించే విధానంలో ఒక విషయం గమనించే ఉంటాం. సాధారణంగా వాచీని ఎడమ చేతికి ధరిస్తారు. కొంతమంది దీనిని కుడి చేతికి కూడా ధరిస్తారు, జనం చేతి గడియారాన్ని ఎడమ చేతికి మాత్రమే ఎందుకు ధరిస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీని వెనుక ఉన్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అందుకే ఎడమ చేతికి వాచీ.. చాలా మంది కుడి చేతితో పని చేస్తారు. ఇలా ఎప్పుడూ జరుగుతుండటం వల్ల ఆ చేయి బిజీగా ఉంటుంది. అలాంటప్పుడు అదే చేతికి వాచీ కట్టుకుంటే తరచూ సమయం చూడటంలో ఇబ్బంది ఎదురవుతుంది. పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎడమ చేతికి వాచీ పెట్టుకుని మళ్లీ మళ్లీ సమయం చూసినా పెద్దగా ఇబ్బంది ఎదురుకాదు. ఇంతేకాకుండా గడియారాన్ని కుడి చేతికి బదులుగా ఎడమచేతికి పెట్టడానికి మరో కారణం ఉంది. అది ఏమిటంటే, అది ఎడమ చేతికి ధరించడం వల్లన ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది తమ పనిని కుడి చేతితో మాత్రమే చేస్తారు. అటువంటి పరిస్థితిలో వాచీ చెడిపోవడం లేదా విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా వాచీల తయారీ కంపెనీలు కూడా లెఫ్ట్ హ్యాండ్ను మాత్రమే దృష్టిలో ఉంచుకుని వాచీలను తయారు చేస్తున్నాయి.
కుడి చేతికి కూడా ధరించవచ్చు అందరూ వాచీని ఎడమ చేతికి మాత్రమే ధరిస్తారనికాదు... కుడిచేతికి వాచీ పెట్టుకునే వారు కూడా చాలా మంది కనిపిస్తారు. వీరిలో చాలా మంది కుడి చేతితో పని చేసేవారే. వాచీని ఏ చేతిలో పెట్టుకున్నామనేది వారి కంఫర్ట్ లెవెల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది.
గతంలో చేతి గడియారం ఇలా.. ఈరోజుల్లో మణికట్టుకు గడియారం పెట్టుకునే విధానం మొదట్లో అలా ఉండేది కాదు.. మీరు ఎప్పుడైనా మీ తాత లేదా ముత్తాతల గడియారాన్ని చూసినట్లయితే, ఆ సమయంలో వాచీలు ఎలా ఉండేవో తెలుస్తుంది. వాటిని మణికట్టు మీద కట్టుకునేవారు కాదు. వాచీని జేబులో పెట్టుకునేవారు. కాలం మారి ఈరోజు నాటికి జేబులోంచి వాచ్ బయటకు వచ్చి మణికట్టు మీదకు చేరి, అలంకారంగా మారింది.
0 Comments:
Post a Comment