Wonderful Waterfalls: మనకు దగ్గర్లోనే ఏడుబావులు జలపాతం .. ఆ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఎక్కడుందంటే..
ఏడు బావులు. వేగంగా దూకుతున్న జలపాతం(Waterfall)నీరు ఒక బావి నుంచి మరో బావిలోకి జారిపోతూ ఉంటాయి.
అంచలంచలుగా దూకే ఈ జలపాతం టూరిస్టుల(Tourists)ను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎత్తయిన కొండలు గుట్టల నడుమ ప్రకృతి రమణీయతను సంతరించుకున్న ఈ ఏడు బావుల పేరు పాండవుల గుట్టలు. వనవాసం టైం లో పంచ పాండవులు(Five Pandavas)ఈ గుట్టల్లో కొంతకాలం బస చేశారని చెబుతారు. పురాణ కథ ఏదైనా అంచలంచెలుగా దూకే ఈ ఏడు జలపాతాలు ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించడంతోపాటు.. పర్యాటకపరంగాను ఎంతోమందిని ఆకర్షిస్తూ వస్తుంది.
ప్రకృతి ఒడిలో సుందర దృశ్యం..
కాకతీయుల పరిపాలన కాలంలో చైన్ ఆఫ్ టాంక్స్ నిర్మించిన ఆనాటి రాజులు.. పూర్తిగా గ్రావిటీ బేస్డ్ ఇరిగేషన్ ని ప్రోత్సహించారు. అంటే ఎత్తైన ప్రాంతంలోని నీటిని ఒక క్రమ పద్ధతిలో దిగువ ప్రాంతాలకు పారించడమే ఇందులో ఉద్దేశం. అయితే ప్రకృతి సిద్ధంగా ఇలా ఏర్పడ్డాయా,. మానవ నిర్మితాల వల్ల ఈ సుందర జలపాతాలు తయారయ్యాయా అనేది ఒక పట్టాన తేల్చుకోలేని అంశం. ఏది ఏమైనా అడవి తల్లి ఒడిలో మరుగున పడిపోయిన ఈ సుందర జలపాతాలను ఒకసారైనా చూసి తీరాల్సిందే.
మరో పర్యాటక ప్రదేశం..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లో ఏడుబావులు అద్భుత మైన జలపాతంగా పేరు ప్రఖ్యాతులు పొందాయి. ఇటీవలి కాలంలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ ఏడుబావుల జలపాతాలు. నర్సంపేట నుండి గంగారం మండలం మీదుగా ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారి కి అటు బయ్యారం మండలం మిర్యాల పెంట చెక్ పోస్టు కు ఎడమవైపున ఐదు కిలోమీటర్లు అడవిలో ప్రయాణిస్తూ వెళితే... ఈ ఏడుబావుల ను చేరుకోవచ్చు.
పాండవుల కానం నాటి జలపాతం..
పాండవుల కాలంలో ఈ బావులు నిర్మిత మైనట్లు చరిత్ర తెలుపుతోంది. అడవిలోని గుట్టల మీదుగా ఔషధమెుక్కల నడుమ జలధారల గుట్ట పైనుండి జలం ....ఆరు జలపాతాలుగా ఆరుబావులను నింపుతూ చివరగా ఏడో బావికి జలపాతం దూకి ఆప్రాంతంలో కనువిందు చేస్తూ... ప్రకృతి రమణీయతను సంతరించుకుంది. ఈ జలపాతం ఎంత సుందరమైందో... అంత ప్రమాదకరం కూడా... ఎందరో పర్యాటకులు ప్రమాదవశాత్తు ఈ బావుల లోజారి పడి మృత్యువాతపడ్డారు. ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడితే... బొగతజలపాతం కన్నా పర్యాటకులు అధిక సంఖ్యలో.. సందర్శించే అవకాశాలున్నాయి... అయినా జనాల రాకపోకలు తెలుగు రాష్ట్రాలనుండి ప్రతీయేట ఏమాత్రం తగ్గడం లేదు.
0 Comments:
Post a Comment