Winter Session: నేటి నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ఎజెండాలో 16 కొత్త బిల్లులు.. పూర్తి వివరాలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి (డిసెంబర్ 7, బుధవారం) ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగనున్నాయి. మొత్తంగా ఈ శీతకాల సమావేశాలు 23 రోజులపాటు జరిగే సెషన్‌లో 17 సభలు జరగనున్నాయి.
కాగా, ఈ సమావేశాల్లో పార్లమెంట్ పాత భవనంలోనే జరగనున్నాయి. ఇది 17వ లోక్‌సభకు 10వ సెషన్ కానుంది. ఎగువ సభ అంటే రాజ్యసభకు ఇది 258వ సెషన్‌గా నిలవనుంది. సాధారణంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలో జరగాల్సి ఉంది. 2017, 2018లో డిసెంబర్‌లో ఇదే సమయంలో జరిగాయి. ఈ ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డిసెంబర్‌లోనే శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం 16 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అవేంటో ఇప్పుడు చూద్దాం:
1. మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2022
2. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు, 2022 (ది నేషనల్ డెంటల్ కమీషన్ బిల్లు)
3. నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు , 2022 (నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు)
4. మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2022 (మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు)
5. కంటోన్మెంట్ బిల్లు, 2022
6. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సవరణ) బిల్లు 2022
7. నార్త్ ఈస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బిల్లు, 2022
8. ట్రేడ్ మార్క్స్ (సవరణ) బిల్లు , 2022
9. వస్తువుల భౌగోళిక సూచనలు (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) సవరణ బిల్లు
10. కళాక్షేత్ర ఫౌండేషన్ (సవరణ) బిల్లు, 2022
11. పాత గ్రాంట్ (నియంత్రణ) బిల్లు 2022
12. రద్దు, సవరణ బిల్లు, 2022
13. రాజ్యాంగం (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు 2022 (రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (ఐదవ సవరణ) బిల్లు
14. రాజ్యాంగం (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (నాల్గవ సవరణ) బిల్లు 2022 (రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (నాల్గవ సవరణ) బిల్లు
15. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (రెండవ సవరణ) బిల్లు 2022
16. రాజ్యాంగం (షెడ్యూల్డ్ తెగలు) ఆర్డర్ (మూడవ సవరణ) బిల్లు 2022
0 Comments:
Post a Comment