Winter Precautions: ఈ రోజుల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. జీవనశైలి మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉదయం పూట వాకింగ్ చేస్తున్నారు.
వాకింగ్ మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. దీంతో వాకింగ్ దివ్య ఔషధంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. ఒళ్లు బద్ధకంగా మారకుండా ఉండేందుకు వాకింగ్ మంచి మందులా పనిచేస్తుంది.
ఉదయం పూట బద్ధకం వీడాలంటే వాకింగ్ చేస్తే ఎంతో లాభం ఉంటుంది. ఉదయం పూట చేసే వాకింగ్ తో దాదాపు 25 రకాల జబ్బులు మన దరి చేరకుండా పోతాయనేది సత్యం. అందుకే అందరు వాకింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు.
వాకింగ్ తో ఇన్ని రకాల మేలు కలుగుతుందని నమ్ముతుండటంతో ఉదయం పూట దీనికి మొగ్గు చూపుతున్నారు.
Winter Precautions
వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నడక ప్రారంభించే ముందు బూట్లు ధరించాలి. నడిచేటప్పుడు రాళ్లు తాకకుండా ఉండాలంటే బూట్లు వేసుకుని నడవాలి. చలికాలంలో అయితే వెచ్చని దుస్తులు ధరించాలి. చేతులకు గ్లౌస్ వేసుకోవాలి. తలపై టోపీ ధరించాలి. శీతాకాలంలో శరీర భాగాలు చల్లగా ఉంటాయి.
శరీరం వెచ్చగా ఉండాలంటే ఉన్ని దుస్తులు ధరించి వాకింగ్ చేయడం మంచిది. మెల్లగా నడవాలి. పరుగెత్తినట్లు నడిస్తే కాళ్లు బెనికే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా నడుస్తూ ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
Winter Precautions
శీతాకాలంలో కూడా శరీరం డీహైడ్రేడ్ కు గురవుతుంది. వేసవి కాలంలో ఎక్కువగా ఈ ప్రమాదం ఉంటుంది. కానీ చలికాలంలో కూడా శరీరానికి నీరు అవసరం ఉంటుంది. శరీరాన్ని ఎప్పుడు హైడ్రేడ్ గా ఉంచుకోవడం మంచిది. వాకింగ్ ప్రారంభించే ముందు తగినంత నీరు తాగాలి. వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలి.
మధ్యమధ్యలో తాగుతుండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. శరీరాన్ని కాపాడుకునే క్రమంలో నీరు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే నీరు తరచుగా తీసుకుంటూ ఉండాలి.
నడుస్తున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల పర్యవేక్షణలోనే వాకింగ్ కొనసాగించాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే తక్షణమే వైద్యుడిని కలిసి తగిన చర్యలు తీసుకోవాలి.
అంతేకాని సొంత వైద్యం అంత మంచిది కాదు. కండరాలు తిమ్మిరిగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాల్సిందే. మనం వాకింగ్ కు వెళ్లే ప్రదేశం కుటుంబ సభ్యులకు చెప్పాలి.
గుండె సమస్యలు ఉంటే వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మధుమేహం, రక్తపోటు ఉంటే అప్రమత్తంగా వ్యవహరించాలి.
0 Comments:
Post a Comment