Winter health tips - చలికాలంలో పరగడుపున బెల్లం ని ఇలా తీసుకుంటే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం!
బెల్లం .. దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. దాదాపు అందరి ఇళ్లలోనూ బెల్లంను విరివిరిగా వినియోగిస్తుంటారు. బెల్లం తియ్యటి రుచితో పాటు బోలెడన్ని పోషక విలువలను కలిగి ఉంటుంది.
అందుకే ఆరోగ్యపరంగా బెల్లం అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా చలికాలంలో పరగడుపున బెల్లం ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎన్నో ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రస్తుత చలికాలంలో బెల్లం ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ ను తీసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న వాటర్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో సేవించాలి. ప్రస్తుత చలికాలంలో ప్రతి రోజూ పరగడుపున బెల్లం ను ఈ విధంగా తీసుకుంటే కీళ్ల నొప్పులు దూరం అవుతాయి. ఎముకలు దృఢంగా మారతాయి.
రక్తహీనత సమస్య ఉంటే క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది. అలసట, నీరసం వంటివి దూరం అవుతాయి. రోజంతా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు. సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. అలాగే గోరు వెచ్చని నీటిలో పైన చెప్పిన విధంగా బెల్లం తరుము, నిమ్మ రసం కలిపి తీసుకుంటే మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా వెయిట్ లాస్ అవుతారు. అంతేకాదు బెల్లానికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. అందువల్ల పైన చెప్పిన విధంగా గోరు వెచ్చని నీటిలో బెల్లం మరియు నిమ్మ రసం కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే కాలేయం శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది. బాడీ డీటాక్స్ సైతం అవుతుంది.
0 Comments:
Post a Comment