Weather : జోరుగా మరో అల్పపీడనం .. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న చలి..
Rain Alert : శీతాకాలం కాస్తా వార్షాకాలంలా మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో అటు చలి, ఇటు వానలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. మాండస్ తుఫాను.. అల్పపీడనం (low pressure)గా మారింది. దాని ప్రభావం చాలా వరకూ తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం) (Photo Courtesy- IMD/ Sattellite Image)
ఈ తుఫాను తెచ్చిన మేఘాల్లో చాలా వరకూ కరగలేదు. ఇవి ప్రస్తుతం కర్ణాటక , ఏపీపై ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో ఉంది. అందువల్ల తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన కంటిన్యూ అవుతోంది.
బంగాళాఖాతంలో ఇవాళ లేదా రేపు ఓ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఏర్పడటానికి ప్రధాన కారణం గాలుల్లో ఉన్న వేగమే. ఇది తుఫానుగా మారే అవకాశం లేదని అనుకుంటున్నా.. దీని ప్రభావం మాత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కొత్త అల్పపీడనం వల్ల.. మేఘాలు వర్షించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాల్లో చలి మరింత పెరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం బంగాళాఖాతం పైనుంచి చల్లని గాలులు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. అవి తెలంగాణ వరకూ వెళ్తున్నాయి. అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.
చలికితోడు పొగమంచు సమస్య మొదలైంది. ఏటా డిసెంబర్, జనవరి నెలలో పొగమంచు వస్తుంది. తెల్లారే వాతావరణం మొత్తం ముసురులా మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్ పరిసరాల్లో ఈ పరిస్థితి ఉంది.
వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. కొన్నిచోట్ల 100 మీటర్ల దూరంలో ఏముందో కనిపించట్లేదు. అందువల్ల వాహనాలను నెమ్మదిగా నడపాల్సి వస్తోంది.
మాండస్ తుఫాను వల్ల.. తమిళనాడు , ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం మొలకలు వచ్చే దుస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల చేతికొచ్చే పంట నీటిపాలైంది. ప్రభుత్వాలే తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు.
0 Comments:
Post a Comment