Weather - ఏపీని వీడని వానలు: అల్పపీడనంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. ఏపీలోని పలు ప్రాంతాల్లో మరో మూడు నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 4, 2022 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి తుపాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ప్రభావంతో డిసెంబర్ 5వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది డిసెంబర్ 7వ తేదీ ఉదయం నాటికి పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖవెల్లడించింది.
పశ్చిమ వాయువ్య దిశగా ఇది పయనిస్తూ డిసెంబర్ 8 నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇక దిగువ ట్రోపోస్పిరిక్ నార్త్ ఈస్టర్ గాలులు ఏపీ, యానాం మీదుగా ఉన్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరకోస్తాంధ్ర, యానాంలలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలోనూ నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్లుండి అంటే ఆదివారం అనేచ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, రాయలసీమలోనూ చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో చదరుమదరు జల్లులు కురిసే అవకాశం ఉంది. శనివారం కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆదివారం మాత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
0 Comments:
Post a Comment