Weather Report: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఆ జిల్లాలకు వర్షసూచన..
బంగాళాఖాతంలో వాయిగుండంతో రానున్నరెండు రోజుల్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వివరించింది.బంగాళాఖాతంలో వాయిగుండంతో రానున్నరెండు రోజుల్లో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వివరించింది.
ఏపి లో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది.
ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ గురువారంనాటికి వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండి తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు రాష్ట్రంలో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది
తమిళనాడు
ఈ వాయుగుండం శ్రీలంకలోని ట్రింకోమలికి తూర్పు ఈశాన్యానికి 420 కి.మీ, తమిళనాడులోని నాగపట్టణం దక్షిణ ఆగ్నేయానికి 600 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 690 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఈ వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదిలి, పశ్చిమ నైరుతి దిశగా శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
చలి తీవ్రత
ఇటు తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో చలి అధికమవుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లాలో 10.8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 11.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లాలో 12.7, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్‌లో 13.1 డ్రిగీలు ఉష్ణోగ్రత నమోదయింది.
0 Comments:
Post a Comment