Waltair Veerayya: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది.. వాల్తేరు వీరయ్య వేటమొదలయ్యేది అప్పుడే..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు. పైగా గాడ్ ఫాదర్ రీమేక్ అవ్వడంతో అంతగా ఫ్యాన్స్ కు ఎక్కలేదు. ఇక ఇప్పుడు ఫుల్ మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఇదిలా తాజాగా ఈ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. వాల్తేరు వీరయ్య ను మొదటి నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్తూ వస్తున్నారు మేకర్స్. అనుకున్నట్టుగానే ఈ ను జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో చిరు మాస్ లుక్ లో కనిపించారు.
సముద్రం మధ్యలో బోట్ పై వేటకు వెళ్తున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక ఈ కు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ కు జోడీగా శ్రుతిహాసన్ కనిపించనుంది.
0 Comments:
Post a Comment