Viral మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. మా విడాకులను రద్దు చేయండి.. హైకోర్టులో వింత కేసు..!
ఆ దంపతులకు 2009లో వివాహం జరిగింది.. ఓ బాబు, పాప జన్మించారు.. ఆ తర్వాత ఆ దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.. 2015 నుంచి విడిగా ఉంటున్నారు.. పిల్లలను తాత, నాయనమ్మ దగ్గరకు పంపించి 2018లో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేశారు..
2019లో వారికి విడాకులు లభించాయి.. విడాకుల తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని ఇద్దరూ అనుకున్నారు.. జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ఎంతో మందిని కలిశారు.. వారికి ఎవరూ నచ్చలేదు.. చివరకు ఆ మాజీ దంపతులు మళ్లీ కలిసి పోవాలని నిర్ణయించుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంట విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత తిరిగి కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేస్తూ, విడాకుల డిక్రీని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భార్యాభర్తల అంగీకారం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోర్టు కూడా డిక్రీని రద్దు చేయాలని ఆదేశించింది. 2019లో విడాకులు పొందిన తర్వాత, వారిద్దరూ వేర్వేరుగా కొత్త జీవితాలను ప్రారంభించాలనుకున్నారు. విడాకుల తర్వాత అతను చాలా మందిని కలిశాడు. కానీ ఎవరూ అతనికి నచ్చలేదు. ఆమె కూడా ఎవరినీ ఇష్టపడలేదు.
పెళ్లి కోసం వేరే వారిని కలుస్తూ ఉంటే వారికి తమ పాత భాగస్వామే చాలా ఉత్తమం అనిపించింది. దీంతో ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. పిల్లల కోసం అయినా కలిసి ఉందామని నిర్ణయించుకున్నారు. హైకోర్టును ఆశ్రయించి తమ విడాకుల డిక్రినీ రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు వారి విడాకులను రద్దు చేసింది.
0 Comments:
Post a Comment