శక్తివంతమైన ఆర్కిటిక్ శీతాకాలపు తుఫానుతో అమెరికా గజగజ వణికిపోతోంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వారం చివరి నాటికి -50F ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
అయోవాలోని డెస్‌మోయిన్స్ నగరం వంటి ప్రధాన మెట్రో ప్రాంతాల్లో రక్తం గడ్డకట్టేంతగా చలి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
హెచ్చరికలు
తుఫాను తీవ్రతరం కావడంతో ప్రధాన విమానాశ్రయాలు వేలాది విమానాలను రద్దు చేశాయి. డిసెంబర్ 22న వేలాది విమానాలు రద్దయ్యాయి. మంచు పేరుకుపోవడంతోపాటు దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారులను కూడా మూసివేశారు. మధ్య అమెరికాలో లక్షలాది పౌరులకు మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి.
కాథీ హోచుల్
న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంచు వల్ల వరదలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. పెద్ద మంచు ముక్కలు నది ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు వరదలు సంభవిస్తాయని పేర్కొన్నారు. కెంటుకీ, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, జార్జియా, ఓక్లహోమా గవర్నర్‌లు కూడా ఎమర్జెన్సీ ప్రకటించారు.
జో బైడెన్
అనవసరంగా బయటకు రావొద్దని దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. " ఇది మీరు చిన్నప్పుడు చూసిన మంచు రోజులు కావు. చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది" అని చెప్పారు. మంచు కారణంగా ప్రధాన రహదారి 'ఇంటర్‌స్టేట్-90'ని సౌత్ డకోటాలో మూసివేశారు. క్రిస్మస్ సెలవులకు ముందు, భారీ మంచు తుఫాన్ అమెరికాన్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
2,270 విమానాలు
మంచు తుఫాన్ 2,270 US విమానాలు రద్దు అయ్యాయని CNN పేర్కొంది. ఎయిర్‌లైన్స్ గురువారం సాయంత్రం 6 ET సమయానికి కేవలం 2,270 US విమానాలను రద్దు చేసింది. శుక్రవారం దాదాపు 1,000 విమానాలను ముందస్తుగా రద్దు చేసింది. శనివారం 85 విమానాలు ఇప్పటికే రద్దు చేశాయి. మంచు తుఫాన్ ప్రభావం చికాగో, డెన్వర్‌లలో ఎక్కువగా ఉంది.
0 Comments:
Post a Comment