తమిళనాడు మంత్రిగా ఉధయనిధి ప్రమాణస్వీకారం..సినిమాలకు గుడ్ బై... పోర్ట్ఫోలియో ఏదంటే..!
Udhayanidhi Stalin | డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో
చెన్నై: డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) యువజన విభాగం కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉధయనిధి స్టాలిన్ ఆ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
ఇవాళ ఉదయం తమిళనాడు రాజ్భవన్లో గవర్నర్ సీటీ రవి ఉధయనిధి చేత రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ సహా, పలువురు డిఎంకే నాయకులు హాజరయ్యారు. ఉధయనిధికి సీఎం స్టాలిన్ రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖను కట్టబెట్టినట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గంలోకి ఉధయనిధిని తీసుకోవాలంటూ ఇటీవల డీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్ పంపిన సిఫారసుకు గవర్నర్ సీటీ రవి ఆమోదం తెలిపారు.
తమిళ నటుడు, నిర్మాత, పంపిణీదారుడు అయిన ఉధయనిధి మొదటిసారిగా 2021 ఎన్నికల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి కూడా అయ్యారు.
0 Comments:
Post a Comment