This 'blood group' is more at risk from mosquitoes.
ఈ ' బ్లడ్ గ్రూప్ వారికి దోమల నుండి ముప్పు ఎక్కువ
పట్టణం మరియు పల్లె అనే తేడా లేకుండా లేచిన పడుకున్నా ఎప్పుడు కూడా దోమల బెడద తప్పడంలేదు. అదృష్టం ఏంటీ అంటే దోమలు అందరిని సమానంగా కుట్టవట. దోమలకు రుచి మరియు అభిరుచి ఉంటుంది అంటూ శాస్త్రవేత్తలు నిర్థారించారు. దోమలు 'ఓ' బ్లడ్ గ్రూప్ వారిని ఎంచుకుని మరీ కుడుతున్నాయట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగం చేసి మరీ గుర్తించారు. ఓ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఈజీగా గుర్తిస్తాయట. వాసన ద్వారా గుర్తించి మెల్లగా కుట్టడంతో పాటు రక్తంను పీల్చుతాయట. రక్తం బయటకు రాకున్నా కూడా ఓ బ్లడ్ గ్రూప్ వారిని గుర్తించడం అంటే మామూలు విషయం కాదు.
ఒక వేళ ఓ గ్రూప్ మనుషులను గుర్తించలేని పక్షంలో ఉన్న రక్తంతో సరి పెట్టుకుంటాయట.
ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తి మరియు ఇతర బ్లడ్ గ్రూప్ వ్యక్తి అక్కడ ఉంటే దోమలు సహజంగానే ఓ గ్రూప్ బ్లడ్ ఉన్న వ్యక్తి వద్దకే వెళ్తాయని ప్రయోగాత్మకంగా శాస్త్రవేత్తలు నిర్థారించారట. వారు చెబుతున్న దాని ప్రకారం దోమలు ప్రత్యేకమైన గుణం కారణంగా ఓ బ్లడ్ గ్రూప్ ను గుర్తిస్తున్నాయట. కొన్ని దేశాల్లో అస్సలే దోమలు ఉండవని అంటున్నారు. అక్కడ వాతావరణం మరియు అక్కడి మానవుల జీవన శైలి కారణంగా దోమలు లేకుండా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో దోమల సంఖ్య మనుషుల సంఖ్యకు పది రెట్లు ఉంటుంది. దోమల పట్ల యుద్దమే చేస్తున్నా కూడా వాటిని మాత్రం లేకుండా చేయడం సాధ్యం కావడం లేదు.
దోమలు ఓ బ్లడ్ గ్రూప్ కోసం అన్వేషిస్తున్న సమయంలో ఇతర బ్లడ్ గ్రూప్ లను కూడా తీసుకునేందుకు సిద్దం అవుతాయి. దోమలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. పగటి పూట కుట్టే దోమలు అత్యంత ప్రమాదం అని.. పగటి పూట దోమ కాటు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. డెంగ్యూ మొదలుకుని మలేరియా వరకు అనేక జబ్బులు దోమల వస్తున్నాయి. కనుక పగటి పూట దోమల నుండి దూరంగా ఉండాలి. దోమలు వాసన పట్టి గుర్తించి వచ్చి ఓ బ్లడ్ గ్రూప్ వారిని అధికంగా కుడుతున్నాయట. అందుకే ఓ బ్లడ్ గ్రూప్ వారు కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనే అభిప్రాయంను శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments:
Post a Comment