ఉంగరం పెట్టుకుంటే జాతకలు మారిపోతాయని .. అదృష్టం వరిస్తూదని ఇప్పటికే చాలా మంది బాబాలు చెప్పడం చూశాం.
ఇదే విధంగా ఉంగరం(Ring)తో తల రాత మారిపోతుందని ఓ రాజకీయ నాయకుడు ప్రగాఢంగా నమ్మడం అతని చేతికున్న ఉంగరం టాపిక్ సోషల్ మిడియా(Social media)లో తెగ వైరల్ (Viral)అవుతుంది.
అదృష్టం వచ్చింది కాని రాజయోగం కోసం ఎదురుచూస్తున్నంటూ ఉంగరం గురించి వివరణ ఇచ్చాడు ఆ లీడర్. అసలు ఆ ఉంగరం ఏంటి దాని వెనుకాల ఉన్న కథేంటి తెలియాలంటే సిరిసిల్ల(Siricilla)జిల్లాకు చెందిన ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.
చిక్కాల వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ..
ఆ లీడర్ పేరు చిక్కాల రామారావు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల విద్యుత్ సహాకార సంఘం ఎన్నికల్లో సెస్ డైరెక్టర్ గా బరిలొకి దిగాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే చేసిన పూజలు ఫలిస్తే వేలికి ఉన్న ఉంగరం జాతకం మారిస్తే మరొసారి సెస్ ఛైర్మన్ పదవి దక్కుతుంది.
ఇదంతా తన వేలికి ఉన్న ఉంగరమే చూసుకుంటుందనేది చిక్కాల రామారావు నమ్మకం. చిక్కాల రామారావు మంత్రికి కేటీఆర్‌కు సన్నిహితుడుగా ముద్రపడింది. గతంలో ఈయన బంగారం కొనడానికి నానా తంటాలుపడేవరటా.
అయితే గతంలో ఓ జ్యోతిష్యున్ని కలిసి ఆయన ఇచ్చిన ఉంగరం వేలికి పెట్టుకోవడంతో ఇప్పుడు కిలోలకు కిలోల బంగారాన్ని కొనుగోలుచేస్తున్నాడటా...ఆ ఉంగరం పెట్టుకోవడం వల్లే తన అదృష్టం మారిపోయి ఐశ్వర్యవంతుడినయ్యానంటూ రామారావు చెబుతున్నారు.
ఉంగరంతో రాజయోగమా..?
తనకు రాజయోగం సిద్ధించాలని కొత్తగా ఓ ఉంగరాన్నిపెట్టుకోవడం సోషల్ మీడియాలో రామారావు వ్యవహారం వైరల్‌గా మారింది. రామారావు వేలికి ధరించిన ఉంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు.
ఒకసారి ఆ ఉంగరం టచ్ చెస్తే ఏమైనా అదృష్టం దక్కుతుందనే ఆశ కూడా కొందరిలో ఉందట. ఆ ఉంగరం ఖరీదు ఐదు లక్షల పైనే ఉంటుందని రామారావు గురువు చెప్పడంతో అందరి కన్ను ఆ ఉంగరం పైనే పోతుంది.
సెంటిమెంట్ నమ్మేవాళ్ల సంఖ్య ఎక్కువే..
రామారావు సైతం అదృష్టం ఉంటేనే రాజకియాల్లో పదవులు దక్కుతాయంటు చెప్పుకొస్తున్నారు. రామారావు సిరిసిల్ల సెస్ డైరెక్టర్ గా బరిలోకి దిగగా గ్రామస్థులు అంతా ఆయనకి మద్దతుగానే ఏకగ్రీవ తీర్మానం చేశారు.
జిల్లాలో బిఆర్ఎస్ బలంగా ఉండడంతో పదిహేను సెస్ డైరెక్టర్ స్థానాలకి గాను పది స్థానాలని గెలుసుకుంటామన్న ధీమాని ఆ పార్టీ శ్రేణులలో ఉంది.
మెజారిటి లెక్క తప్పకుంటే చిక్కాల రామారావే సెస్ ఛైర్మన్ కుర్చిలో రింగ్ తో కూర్చుండే అవకాశం లేకపోలేదు.
2018 సాధారణ ఎన్నికల్లో కూడా చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించేందుకు చాలా మంది బాబాలను కలిశారు.
వాళ్లు చెప్పిన విధంగా చాలామంది నాయకులు యంత్రాలు, తాయత్తులతో పాటు కొంత మంది క్షుద్ర పూజలు చేసిన వాళ్లు ఉన్నారు. మరి వీరి రింగ్ సెంటిమెంట్ నిజమేనా లేక ప్రచారామేనా అనే టాగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది.
0 Comments:
Post a Comment