Teacher Transfers - ఉపాధ్యాయుల వివరాలు గల్లంతు..
అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో సీనియార్టీ జాబితా కీలకం. సీనియార్టీ ఉన్నవారికి తొలి ప్రాధాన్యం కల్పిస్తారు. ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ప్రభుత్వం శనివారం జారీ చేసింది.
ఇందులో అనేక లోపాలున్నాయి. చాలామంది ఉపాధ్యాయుల వివరాలు, పేర్లు, పాయింట్లు లేవు. దరఖాస్తులో కనిపించిన పాయింట్లు సీనియార్టీ జాబితాలో రాలేదు. వివరాలు గల్లంతైతే తమపరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గురువులు
2021లో అడహక్ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు కూడా బదిలీ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవలే పదోన్నతిపై కొత్త పాఠశాలల్లో చేరాం. మళ్లీ బదిలీ ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ బదిలీలు ఆపాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 100 మందికి పైగా న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చారు. అడహక్ పదోన్నతులు పొందిన వారికి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బదిలీలు నిలుపుదల చేయాలని ఉత్తర్వులు వచ్చాయి. వాటిని శనివారం జిల్లా విద్యాశాఖ అధికారులకు సమర్పించారు. దీంతో వారి స్థానాలను ఖాళీగా చూపకుండా బ్లాక్ చేస్తున్నారు. 2022లో కొందరు ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. వారికి ఇంత వరకు స్థానాలు కేటాయించలేదు. వారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.
0 Comments:
Post a Comment