Tax News: ప్రజలపై పన్నుల బాంబ్.. మోదీ సర్కార్ న్యూ ఇయర్ ప్లాన్.. 2023 భయానకం కాబోతోందా..?
Tax News: కొత్త సంవత్సరం వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం ఏమైనా వరాలు అందిస్తుందా అని చాలా మంది వేచిచూస్తున్నారు. అయితే 2023లో ప్రపంచం ఆర్థికంగా మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా అంచనాలు చెబుతున్నాయి.
అందుకు అనుగుణంగా చాలా దేశాలు సమాయత్తమౌతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ పరిస్థితి..
గ్లోబల్ మాంద్యం ఉన్నప్పటికీ కొత్త సంవత్సరం భారత వృద్ధి రేటు బాగానే ఉంటుందని చాలా సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. అయితే రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనాలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రపంచ పరిస్థితుల కారణంగా భారత్ లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ప్రధానమైనది పెరుగుతున్న వాణిజ్య లోటు. మందగమనం మధ్య భారత ఆహార ఉత్పత్తుల నుంచి వస్త్రాల వరకు ఎగుమతులు క్షీణించాయి.
కేంద్ర ప్రభుత్వం..
రానున్న పరిస్థితులను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అనవసర వస్తువులపై అదనపు దిగుమతి సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో.. దేశంలోనే తగినంత ఉత్పత్తి సామర్థ్యం ఉన్న వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా నిరోధించడానికి దిగుమతి సుంకాన్ని విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇది చాలా వస్తువులను ఖరీదుగా మార్చనుంది.
టాక్సుల బాదుడు..
గుర్తించిన వస్తువుల దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపు కోసం జాబితాను ఇప్పటికే తయారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సుంకం పెరుగుదల HSN కోడ్‌లోని ఇతర వస్తువులకు వర్తించదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2022-23 బడ్జెట్‌లో చాలా వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గొడుగులు, హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్లు, లౌడ్‌స్పీకర్లు, స్మార్ట్ మీటర్లు, గిల్టు నగలు వంటి రోజువారీ వినియోగ వస్తువులపై అధిక కస్టమ్స్ సుంకాలు గతంలో విధించబడ్డాయి.
గత 5 సంవత్సరాలు..
గడచిన 5 సంవత్సరాల్లో బాదం, ఆపిల్ వంటి అనేక ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం అనేక రెంట్లు పెంచింది. దీనికి తోడు మెుబైల్ ఫోన్ల విడిభాగాలు, సోలాన్ ప్యానెళ్లపై కూడా అధికంగా పన్నులు పెంచటం జరిగింది. వాణిజ్య లోటు పెరుగుతున్న తరుణంలో చెల్లింపులకు అవసరమైన డాలర్ల కొరత ఉండటం కారణంగా భారత్ అనేక ప్రత్యామ్నాయాలను అవలంభిస్తోంది. కొన్ని వస్తువులపై పన్నుల పెంపు కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. అందుకే గత కొంత కాలంగా అనేక దేశాలతో రూపాయి మారకం ద్వారా వ్యాపారం చేసేందుకు భారత్ చర్యలు జరుపుతోంది. కొన్ని దేశాలతో ఇప్పటికే ఆ ఫార్ములాను అమలు చేస్తోంది.
0 Comments:
Post a Comment