Sushant Singh Rajput Case : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోలేదు.. హత్యే!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(sushant singh rajput) మరణించి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
మెుదట ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తర్వాత ఒత్తిడి పెరగడంతో కేసును సీబీఐ(CBI)కి అప్పగించారు. ఇప్పటి వరకు విచారణ పూర్తి కాలేదు. దీనిపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై హత్య ఆరోపణలు వచ్చాయి. అయితే సుశాంత్ సింగ్ పోస్టుమార్టంలో పాల్గొన్న కూపర్ హాస్పిటల్(Cooper Hospital) సిబ్బంది ఇప్పుడు చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(Sushant Singh Rajput Suicide) చేసుకోలేదని, హత్య చేశారని కూపర్ హాస్పిటల్‌లోని మార్చురీలో పనిచేసిన రూపకుమార్ షా ఆరోపించారు. 'సుశాంత్ మృతదేహం వచ్చినప్పుడు, అతని శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని ఎవరో కొట్టారు.'అని రూపకుమార్ చెప్పారు.
సుశాంత్ సింగ్(sushant singh rajput) మృతదేహానికి పోస్టుమార్టం జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇది ఆత్మహత్య(Suicide) కాదని, హత్య అని డాక్టర్‌కి చెప్పాను. కానీ ఎవరూ నన్ను పట్టించుకోలేదు' అని రూపకుమార్ అన్నారు. ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారనే ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు. 'పనిలో ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఇంత సేపు మాట్లాడలేదు' అన్నారు. కూపర్ హాస్పిటల్ మార్చురీలో రూపకుమార్ పనిచేశాడు. నెలన్నర క్రితం పదవీ విరమణ చేశారు.
ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తి(rhea chakraborty) ప్రధాన నిందితురాలుగా ఉంది. ఈ కేసులో అరెస్టై బెయిల్ మంజూరైంది. విచారణలో, 'ఏయూ' అనే వ్యక్తి నుండి రియాకు 44 కాల్స్ వచ్చినట్టుగా తెలిసింది. ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే అని బీహార్ పోలీసులు తెలిపారు.
దీనిపై లోక్‌సభలో ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎంపీ రాహుల్ షెవాలే మాట్లాడారు. 'రియా చక్రవర్తికి ఏయూ నుంచి 44 కాల్స్ వచ్చాయి. ఏయూ అంటే ఆదిత్య ఠాక్రే(aditya thackeray) అని బీహార్ పోలీసులు తెలిపారు. సీబీఐ విచారణ ఏ దశలో ఉంది?' అని గతంలో అడిగారు. ఈ కామెంట్స్.. సంచలనం సృష్టించాయి. సుశాంత్ కేసు విషయంలో సీబీఐ విచారణ స్థితిని వెల్లడించాలని ఎంపీ డిమాండ్ కూడా చేశారు. ఆ సమయంలో రియాకు కాల్ చేసినది మరొరకు కాదని, అప్పటి మంత్రి ఆదిత్య ఠాక్రే అని బీహార్ పోలీసులు కనుగొన్నారని ఆరోపించారు.
0 Comments:
Post a Comment