షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. షుగర్ కాస్త ఎక్కువ ఉన్నా పర్వాలేదు కాని షుగర్ లెవల్స్ పడిపోతే మాత్రం అత్యంత ప్రమాదం. షుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
షుగర్ లెవల్స్ ను తగ్గించుకునేందుకు లేదా ఒక లెవల్ లో ఉంచుకునేందుకు గాను ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. అది ఇంజక్షన్ లేదా ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది. ప్రతి రోజు ఒకే డోసు ఇన్సులిన్ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి.
అలా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాని కొన్ని సార్లు తీసుకునే ఆహారం మరియు ఇతర కారణాల వల్ల సహజంగానే షుగర్ నార్మల్ స్టేజీకి వస్తుంది.
ఆ విషయం తెలియని వారు ఎప్పటిలాగే ఇన్సులిన్ వేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ మరింతగా పడిపోయే అవకాశం ఉంటుంది.
షుగర్ లెవల్స్ ను తగ్గించేందుకు గాను ఇచ్చిన ఔషధం మరింతగా తగ్గిస్తే అప్పుడు షుగర్ వ్యాధిగ్రస్తులు కళ్లు తిరిగి పడిపోవడం లేదంటే తీవ్రమైన తల తిరగడం వంటివి జరుగుతాయట.
ఆ సమయంలోనే కాస్త వారి నోట్లో చెక్కర వంటి తీపి పదార్థం వేయడం వల్ల మళ్లీ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. షుగర్ లెవల్స్ ఎప్పుడైతే పూర్తిగా తగ్గిపోతాయో ఆ సమయంలో అవయవాలు పని చేయడం కూడా ఆగి పోతాయట.
తద్వారా కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్ పడి పోయినట్లు గా వ్యాధిగ్రస్తులకు కొన్ని సార్లు తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు వారికి కూడా తెలియకుండా ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోతాయి.
దాంతో వారు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. షుగర్ లెవల్స్ పడిపోయిన సమయంలో పక్కన ఎవరు లేకపోతే మాత్రం ప్రాణాలకే ప్రమాదం.
షుగర్ లెవల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకుంటే రెగ్యులర్ గా అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు తినే ఆహారం మాత్రమే తినాలి.. అది కూడా క్రమం తప్పకుండా వారంకు కనీసం ఒక్క సారి అయినా షుగర్ లెవల్స్ టెస్టు కు వెళ్లాల్సి ఉందని అంటున్నారు.
ఎప్పుడైతే షుగర్ లెవల్స్ పడిపోతాయో అప్పుడు ఇంజక్షన్ కు బదులుగా చక్కెర ను ఇవ్వాల్సి ఉంటుంది. చక్కెరతో పాటు ఆ సమయంలో కాస్త ఎనర్జీ బూస్టింగ్ కు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ను ఇవ్వాలి. ఆ తర్వాత కాస్త కుదుట పడ్డ తర్వాత లైట్ ఫుడ్ ను అందించాలి.
షుగర్ కాస్త ఉండే పండ్లను తినడం ద్వారా మళ్లీ షుగర్ లెవల్స్ నార్మల్ కు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క షుగర్ పేషంట్ కూడా తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎక్కువ తినడం వల్ల ఇన్సులిన్ డోసు ఎక్కువ తీసుకోవాలి.. ఒక వేళ ఏదైనా రోజు ఆహారం తినకున్నా లేదంటే స్వీట్స్ వంటివి తిన్నాం కదా అంటూ ఎక్కువ ఇంజక్షన్ వేస్తే ఆ సమయంలో షుగర్ లెవల్స్ పడి పోయే అవకాశం లేదు.
కాని ఎప్పుడైతే ఏమీ తినకుండానే షుగర్ వ్యాది గ్రస్తులు ఇన్సులిన్ తీసుకుంటారో వారే అన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
0 Comments:
Post a Comment