అతిలోకసుందరి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పలు చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.
16 సంవత్సరాల సమయంలో పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్ గా అటు తమిళ్.. ఇటు తెలుగు భాషల్లో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది .
ముఖ్యంగా దక్షిణాది భాషల్లో ఒక ఊపు ఊపిన శ్రీదేవి (Sridevi) బాలీవుడ్ లో సైతం తన చరిష్మా చాటింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం,హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అన్ని భాషలలో అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
శ్రీదేవి (Sridevi) అంటే చాలామందికి ఇష్టం ఎంతలా అంటే.. శ్రీదేవి తమతో మాట్లాడితే చాలని.. కలిస్తే చాలని పడిగాపులు కాసేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో దుబాయ్ సేట్ కూడా ఒకరు.
అయితే శ్రీదేవి తనతో మాట్లాడితే చాలు రూ.200 కోట్లు అయినా ఇచ్చేస్తా అంటూ.. ఆమె కోసం రూ.100 కోట్ల విలువైన సరస్వతీ మహల్ అనే ఒక ఇంటిని కొనేసి పేపర్స్ కూడా ఆమె చేతిలో పెట్టారు. అంతలా అభిమానులు ఆమెను ఎంతో ఆరాధించేవారు.
ఇక కొందరైతే రాత్రి కలలోకి వచ్చారు మీరు ఈ చెక్కు తీసుకోండి అంటూ 1000 రూపాయల చెక్కు రాసి ఆ రోజుల్లోనే పంపేవారట.
అంతటి క్రేజీ హీరోయిన్ గా శ్రీదేవి హవా నడిచింది. ముఖ్యంగా ఈమె కోసం ప్రత్యేకంగా దర్శక నిర్మాతలు కూడా ఎదురు చూసేవారు. ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్న శ్రీదేవి అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే కాదు అంతకుమించి ప్రేమ కూడా.
అయితే జీవితంలో తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోయిన శ్రీదేవి వ్యక్తిగతంగానైనా ప్రేమను పొందాలని పరితపించింది. .
కానీ ఏ ఒక్కరు కూడా ఆమె ప్రేమను అంగీకరించలేకపోయారు. కానీ ఆమెను వాడుకొని వదిలేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయినా కూడా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా మొండిగా నిలబడి ధైర్యంగా ముందడుగు వేసిన శ్రీదేవి అంటే ఎవరికైనా సరే మంచి అభిప్రాయమే కలుగుతుంది. ఇక శ్రీదేవి మనమధ్య లేకపోయినా ఆమెను మాత్రం ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పవచ్చు.
0 Comments:
Post a Comment