Smartwatch: వాటర్‌ప్రూఫ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అదిరింది.. ఒక్కసారి చార్జింగ్ పెడితే నెలంతా వస్తుంది!
Pebble Smartwatch | కొత్త స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే మీరు ఈ స్మార్ట్ వాచ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? మీరు ఒక్కసారి చార్జింగ్ పెడితే నెల రోజుల పాటు స్టాండ్ బై వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. అలాగే ఒక్కసారి చార్జింగ్ పెడితే వారం రోజులు స్మార్ట్ వాచ్ ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంకా ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంతకీ మనం మాట్లాడుకునే స్మార్ట్ వాచ్ ఏ కంపెనీదని ఆలోచిస్తున్నారా? పెబ్బల్ కంపెనీ స్మార్ట్ వాచ్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి. పెబ్బల్ కంపెనీ అవేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
కాస్మోస్ ఎండ్యూర్ అనే స్మార్ట్ వాచ్‌లో అదిరే ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ రేటు రూ. 4,999. సాధారణంగా అయితే దీని రేటు రూ. 12,999గా ఉంది. అంటే మీకు 62 శాతం డిస్కౌంట్ ఉంది. ఇది బ్లూ, బ్లాక్, మిలిటరీ గ్రీన్ రంగుల్లో లభిస్తోంది.
షాక్ ప్రూఫ్ ఫుల్ మెటల్ అలాయ్ కేస్, హైలీ డ్యూరబుల్ గ్లాస్, 1.46 ఇంచుల లార్జ్ అమొలెడ్ డిస్‌ప్లే, బెజిల్ లెస్ ఎండ్ టు ఎండ్ డిస్‌ప్లే, ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, హైరెజల్యూషన్ స్క్రీన్, 400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అంతేకాకుండా వాటర్ ప్రూఫ్ వాచ్ కూడా. ఐపీ68 రేటింగ్ ఉంది. బ్లూటూత్ 5.0 కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. స్పీకర్ ఫోన్, మైక్, కాల్స్, రీసెంట్ లాగ్స్, డయల్ ప్యాడ్ వంటివి అన్నీ ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. మల్టీ స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి.
అలాగే ఇతర స్మార్ట్ వాచ్‌లలో ఉండే విధంగా ఈ కొత్త స్మార్ట్ వాచ్‌లో కూడా స్లీప్ మానిటర్, బ్లడ్ ప్లెజర్ మానిటర్, మల్టీ స్పోర్ట్ ట్రాకర్, ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, హార్ట్ రేటు మానిటర్ వంటి ఫీచర్లు అన్నీ ఉన్నాయి.
అదే మీరు ఈ స్మార్ట్ వాచ్‌ను దిగ్గజ ఝఈకామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌లో కొనుగోలు చేస్తే.. అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 350 వరకు తగ్గింపు వస్తుంది. ఇంకా ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 215 చెల్లించి ఈ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయొచ్చు. 24 నెలలకు ఇది వర్తిస్తుంది.
అదే 18 నెలలు అయితే నెలకు రూ. 281 కట్టాలి. ఏడాది టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 406 ఈఎంఐ పడుతుంది. 9 నెలలు అయితే నెలకు రూ.532 చెల్లించాలి. నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ కూడా ఉంది. నెలకు రూ.750 కట్టొచ్చు. ఆరు నెలలకు ఇది వర్తిస్తుంది. అదే మూడు నెలలు అయితే నెలకు రూ. 1500 చెల్లించాల్సి వస్తుంది.
0 Comments:
Post a Comment