Small Saving Schemes: మధ్యతరగతికి మోదీ కొత్త ఏడాది కానుక? కేంద్రం కీలక నిర్ణయం? జనవరి 1 నుంచి..
Saving Schemes | కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించబోతోందా?
మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగే ప్రకటన చేయనుందా? కొత్త ఏడాది కానుక అందించబోతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల చివరిలో ఈ అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోనుంది.
కేంద్ర ప్రభుత్తం ప్రతి త్రైమాసికం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది రెపో రేటును 225 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
ఈ క్రమంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెరుగుతూ వచ్చాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను పెంచొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి.
2023 జనవరి - మార్చి త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొత్త ఏడాది కానుక అందించినట్లు అవుతుంది.
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో సేవింగ్స్ పెరగాలనే లక్ష్యంతో చిన్న మొత్తాల పొదుపు పథకాలు అందుబాటులో ఉంచింది. వీటిల్లో రెగ్యులర్‌గా డబ్బులు పొదుపు చేయొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి.
సేవింగ్స్ డిపాజిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ అనేవి ఇవి. వీటిల్లో ప్రజలు వారికి నచ్చిన పథకాన్ని ఎంచుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఆకర్షణీయ రాబడి పొందొచ్చు.
సేవింగ్స్ డిపాజిట్లలో ఏడాది, మూడేళ్ల టైమ్ డిపాజిట్లు, ఐదేళ్ల టెన్యూర్‌తో రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర వంటి వాటిని కూడా వీటి కిందనే చెప్పుకుంటారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి వాటిని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌గా పేర్కొంటారు. ఇక మంత్లీ ఇన్కమ్ అకౌంట్‌ను మంత్లీ ఇన్కమ్ ప్లాన్ కింద చెప్పుకుంటారు.
కాగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత త్రైమాసికంలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు పెంచింది. అయితే కొన్ని పథకాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. కేవీపీ, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, టైమ్ డిపాజిట్లు, మంత్లీ ఇన్కమ్ ప్లాన్ వంటి వాటిపై వడ్డీ రేటును 10 నుంచి 30 బేసిస్ పాయింట్లు పెంచేసింది.
0 Comments:
Post a Comment