Sleep - నిద్ర పట్టకుంటే ఇలా ట్రై చేయండి.. 5 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారుకుంటారు...
పడుకున్న వెంటనే కొందరు నిద్రలోకి జారుకుంటారు... కొందరు మాత్రం నిద్రపోయేందుకు కనీసం గంట సమయం పడుతుంది. నిద్ర పట్టక ఫోన్ చూస్తారు.. టీవీ చూస్తారు.. చివరకు ఏ మధ్య రాత్రి నిద్రలోకి జారుకుంటారు. పడుకున్న వెంటనే నిద్ర పోయే అలవాటు మాకు కూడా ఉంటే ఎంత బాగుండు అని చాలా మంది అనుకోవడం మనం వింటూనే ఉంటాం. నేను పడుకోవాలంటే మధ్య రాత్రి అవ్వాల్సిందే.. పది గంటలకు తిని పడుకుంటే నిద్రలో జారడానికి పన్నెండు అవుతుందని.. ఎంతగా ప్రయత్నించినా కూడ ఆ పది గంటలకు నిద్రలోకి జారుకోలేక పోతున్నాను అంటూ చాలా మంది అంటూ ఉంటారు.
మధ్య రాత్రి వరకు పడుకోకున్నా కూడా ఉదయాన్నే లేవాల్సి ఉంటుంది. చాలా మందికి సరైన నిద్ర అందడం లేదు.
అందువల్ల చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. నిద్ర లేని కారణంగా మానసిక సమస్యలు కూడా మొదలు అవుతాయి. నిద్ర అనేది ఆరోగ్యానికి మంచి ఔషధం వంటిది. అందుకే ప్రతి ఒక్కరు ఈ సమయంలో నిద్ర ఎక్కువ పోవడం వల్ల ఇమ్యూనిటీని దక్కించుకోవాలి. తద్వారా ఏ జబ్బు వచ్చినా కూడా ఎలాంటి ఆందోళన లేకుండా వెంటనే కోలుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయేందుకు అవకాశం ఉన్నా కూడా చాలా మంది మధ్య రాత్రి దాటినా కూడా సినిమాలు ఫోన్ లు చూస్తూ సమయం వృధా చేస్తారు. వారు ఇకపై అయినా త్వరగా నిద్ర పోయేందుకు ప్రయత్నిస్తే మంచిది.
నిద్ర పట్టని వారు ఇప్పుడు నేను చెప్పబోతున్న కొన్ని చిట్కాలు పాటించడం వల్ల నిద్రలోకి వెంటనే జారుకుంటారు. నిద్ర వెంటనే రావాలంటే పడుకునే ముందు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకుని రెండు చుక్కలు ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. తద్వారా చాలా ఈజీగా నిద్ర పడుతుంది. ముక్కులో వేసిన నెయ్యి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. శ్వాసకు ఇబ్బంది అని కొందరు అనుకోవచ్చు. కానీ అసలు కానే కాదు. పడుకునే సమయంలో కాస్త గోరు వెచ్చని పాలు తాగడం వల్ల కూడా నిద్రలోకి వెంటనే జారుకునే అవకాశాలు ఉంటాయి. బరువు పెరుగుతాం అనే భయం లేని వారు పడుకునే ముందు కాస్త ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. నిద్ర కు ఉపక్రమించే అందుకు ముందు అయిదు నుండి పది నిమిషాలు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా లేదా ధ్యానం చేయాలి. అలా చేయడం వల్ల మనసు తేలికపడి వెంటనే నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పడుకున్నప్పుడు చాలా చిన్న సౌండ్ తో శ్రావ్యమైన శబ్దాలను వినాలి. తద్వారా వింటున్న సమయంలో నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. పడుకున్న వారికి హెడ్ మసాజ్ చేయడం వల్ల కూడా త్వరగా నిద్రలోకి జారుకుంటారు. రాత్రి పొద్దుపోయే వరకు నిద్ర పట్టని వారు పడుకోవడానికి కనీసం రెండు కిలోమీటర్లు వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం వల్ల బాడీ అంతా అలసి పోయినట్లుగా అవుతుంది. తద్వారా వెంటనే నిద్ర పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా నిద్రలోకి జారుకోవడానికి మార్గాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు ఇందులో ఏదో ఒకదాన్ని అయినా ప్రయోగించి ఫలితం సాధిస్తారని ఆశిస్తున్నాం.
0 Comments:
Post a Comment