SBI Notification: ఎస్బీఐలో 1438 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే.. ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..
ఇప్పట్లో ఏ ఉద్యోగం సాధించాలన్నా పెద్ద టాస్క్ లా ఉంటుంది. కేంద్రప్రభుత్వ కొలువులు అయితే మరీనూ.. ఒకటికి బదులు రెండు మూడు పరీక్షలు రాయందే ఉద్యోగం రాదు.
కానీ.. ఎస్.బి.ఐ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ పరీక్ష ఏమీ లేకుండానే నేరుగా ఇంటర్వ్యూలకు రారమ్మని ఆహ్వానం పలుకుతోంది. అయితే ఒక కండీషన్ పెట్టింది. ఆ కండీషన్ కు లోబడిన వారికి మాత్రమే ఉద్యోగాలకు అవకాశం.
ఇంతకీ ఎస్.బి.ఐ పెట్టిన ఆ కండీషన్ ఏమిటంటే..
అభ్యర్థుల వయసు
ఈ ఎస్.బి.ఐ జాబ్స్ కు అప్లై చేసుకునేవారి వయసు 60 సంవత్సరాలు ఉండాలని రూల్ పెట్టింది. అంతేకాదు.. ఆ అభ్యర్థులు కూడా ఇదివరకే ఎస్.బి.ఐ లో పనిచేసి ఏదైనా కారణం వల్ల ఆ ఉద్యోగాల నుండి వైదొలగి ఉండాలి. అంటే అభ్యర్థులకు ఎస్.బి.ఐ లో పనిచేసిన అనుభవం ముందే ఉండాలి. ఇలాంటి వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎంపిక చేయబడిన షార్ట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూకు కబురుపెడతారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ, ఛండీఘడ్, జైపూర్,పాట్నా, అహ్మహాబాద్, హైదరాబాద్, మహారాష్ట్ర, చెన్నై మొదలైన ఎస్.బి.ఐ కార్యాలయాలలో పోస్టింగ్ ఇస్తారు.
పోస్ట్ లు ఏవంటే..
నోటిఫికేషన్ లో మొత్తం పోస్టుల సంఖ్య 1438.
వీటిలో జనరల్ పోస్టులు 680
EWS పోస్టులు 125
OBC పోస్టులు 314
SC పోస్టులు 198
ST పోస్టులు 121
సాలరీలు ఎలా ఉంటాయంటే...
ఇందులో ఎంపికైన అభ్యర్థులకు క్లరికల్ పోస్టులకు అయితే 25వేల రూపాయల జీతం ఇస్తారు. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ పోస్టులకు 35వేలు, మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2,3 పోస్టులకు 40వేల రూపాయల జీతం ఇస్తారు.
ఎలా అప్లై చేయాలంటే..
ఎస్.బి.ఐ ఆఫీషియల్ వెబ్సైట్ ను సందర్శించాలి. (sbi.co.in/web/careers.)
వెబ్సైట్ హోమ్ పేజిలో 'ENGAGEMENT OF RETIRED BANK OFFICERS/STAFF OF SBI & e-ABs ON CONTRACT BASIS' అనే లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
తరువాత apply online అనే లింక్ ను క్లిక్ చేయాలి.
రిజిస్టర్ చేసుకున్న తరువాత proceed for application form క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి upload the required documents లో అన్ని రకాల ధృవీకరణ పత్రాలను అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చెయ్యాలి.
సబ్మిట్ చేసిన పేజ్ ను డౌన్లోడ్ చేసి రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోవాలి.
అంతే పైవిధంగా అప్లై చేసుకున్న అభ్యర్థులు షార్ట్ లిస్ట్ కు ఎంపికై ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే ఇక వయసైపోయిందే అనుకుని చింతించాల్సిన అవసరం లేకుండా ఉద్యోగం చేసుకోవచ్చు పెద్దవారు.
0 Comments:
Post a Comment